ETV Bharat / city

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. వారి కుటుంబాలకే ప్రాధాన్యం..

Compassionate appointments in TSRTC: ఆర్టీసీ యాజమాన్యం కారుణ్య నియామకాలకు ఇటీవలే పచ్చజెండా ఊపింది. అందులో భాగంగా కారుణ్య నియామకాలను పరిగణలోకి తీసుకోని..ఎంపిక చేసిన వారిని ఉద్యోగంలోకి తీసులోవాలని జీవో జారీచేసింది. డ్రైవర్, కండక్టర్ , ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ విభాగాల్లో కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ఆర్టీసీ నిర్ణయించింది.

TSRTC Green signal to Compassionate appointments in Telangana

author img

By

Published : Jul 8, 2022, 6:49 AM IST

Compassionate appointments in TSRTC: కారుణ్య నియామకాలకు తెలంగాణ ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలు కొన్నేళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్నాయి. డ్యూటీ చేస్తూ గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ముందుగా కొలువులివ్వాలని నిర్ణయించింది. గ్రేడ్‌-2 డ్రైవర్లు, కండక్టర్లు, కానిస్టేబుల్‌, శ్రామిక్‌ పోస్టులను ఏకమొత్తం వేతనం(కన్సాలిడేటెడ్‌ పే)పై నియమించనున్నారు. కారుణ్య నియామకాల ఉత్తర్వులను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ జారీ చేశారు. డ్రైవర్ గ్రేడ్ -2 పోస్టుకు రూ.19,000లు, కండక్టర్ గ్రేడ్ -2 పోస్టుకు రూ17,000లు, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టుకు రూ.15,000, శ్రామిక్ పోస్టుకు రూ.15,000లు కాన్ సాలెటెడ్ జీతంగా ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

"ఆర్థిక పరిస్థితితో పాటు కరోనా కారణంగా 2019 నుంచి కారుణ్య నియామకాలు చేపట్టలేకపోయాం. పెండింగ్‌ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని దశల వారీగా నియామకాలు చేపడతాం. గతంలో ఎంపికైన వారిని తక్షణమే నియమిస్తాం. కారుణ్య నియామకం కింద ఎంపికై వారు మూడేళ్లపాటు ఏకమొత్తం వేతనం కింద సర్వీసు పూర్తి చేసిన వారికి పనితీరు అంచనా పరీక్ష నిర్వహిస్తాం. అందులో 60 శాతం మార్కులు సాధిస్తే పూర్తిస్థాయి స్కేలు మేరకు సర్వీసులోకి తీసుకుంటాం. ఈ మూడేళ్ల వ్యవధిలో నియమితులైన ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 240 రోజులు పనిచేసి ఉండాలి. గ్రేడ్‌-2 డ్రైవర్‌కు రూ.19 వేలు, గ్రేడ్‌-2 కండక్టరుకు రూ.17 వేలు, ఆర్టీసీ కానిస్టేబుల్‌, శ్రామిక్‌లకు రూ.15 వేల చొప్పున ఏకమొత్తం వేతనం చెల్లిస్తాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామక అర్హులకు లేఖలు పంపుతాం. వారు ఉద్యోగంలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చాక రీజినల్‌ మేనేజర్లు ఖాళీల మేరకు నియామక ప్రక్రియను చేపడతారు" అని సజ్జనార్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.