ETV Bharat / city

TSRTC Latest News : ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు - తెలంగాణ ఆర్టీసీ

TSRTC Latest News : ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ కుంగుతోంది. నష్టాలు, అప్పులు రూ.వేల కోట్లలో ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వందల కోట్లలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీ నానాయాతన పడుతోంది. ఓ గాడిన పడేందుకు చాలా కృషి చేస్తోంది. తాజాగా ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

TSRTC Latest News
TSRTC Latest News
author img

By

Published : Feb 4, 2022, 9:00 AM IST

TSRTC Latest News : రెండేళ్లుగా కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికీ ఇంకా తేరుకోలేదు. కాస్త గాడిన పడుతోంది అనుకున్న తరుణంలో కొవిడ్ మూడో దశ, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తితో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్, ఛైర్మన్​గా బాజిరెడ్డి గోవర్ధన్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఆర్టీసీని నష్టాల ఊబిలో నుంచి లాగేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయినా టీఎస్​ఆర్టీసీ రోజురోజుకు నష్టాల ఊబిలోకి వెళ్తూనే ఉంది.

ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు..

Extra Charges in TSRTC Special Buses : తాజాగా.. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై టీఎస్‌ఆర్టీసీ మళ్లీ దృష్టిపెట్టింది. ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు హైదరాబాద్‌ నగరం నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ నెల 13 నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కసరత్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత దసరా, సంక్రాంతి సమయాల్లో నడిపిన ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయని ఆర్టీసీ.. ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో రూ.75-100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.

జనవరిలో భారీగా తగ్గిన ఆదాయం

Special Bus Ticket Prices in Telangana : గత ఏడాది జనవరిలో ఆర్టీసీకి రూ.337.79 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జనవరిలో ఆ మొత్తం రూ.287.07 కోట్లకే పరిమితమైంది. రూ.51 కోట్ల ఆదాయం తగ్గింది. గత డిసెంబరు ఆదాయం రూ.352.67 కోట్లతో పోల్చినా జనవరిలో రూ.65.55 కోట్ల మేర తగ్గింది.

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.