ETV Bharat / city

TSPSC OTR: ఎడిట్‌ ఆప్షన్‌ ఇద్దామా.. సాఫ్ట్‌వేర్‌ సాయం తీసుకుందామా? - modifications in TSPSC OTR

TSPSC OTR: రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఓటీఆర్​లో నమోదైన అభ్యర్థుల సమాచారాన్ని సరిచేయాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. తాజా ఉత్తర్వులతో స్థానికత మారుతున్న నేపథ్యంలో పలు మార్గాలను కమిషన్​ అన్వేషిస్తోంది. ఎడిట్​ ఆప్షన్​ లేదా సాఫ్ట్​వేర్​ సాయం తీసుకొనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

tspsc
tspsc
author img

By

Published : Feb 18, 2022, 9:03 AM IST

TSPSC OTR : రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న ఉద్యోగార్థుల స్థానిక జిల్లా, జోన్లలో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీఎస్‌పీఎస్సీ వద్ద వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) కింద నమోదైన 25 లక్షల మంది ఉద్యోగార్థులకు సంబంధించి స్థానికత వివరాలు సరిచేయాల్సి ఉంది. 2018లో కొత్త ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులు వెలువడగా అంతకు ముందుతో పోల్చితే స్థానికత నిర్వచనం మారింది. దాంతో ఆ మేరకు సొంత జిల్లాలు మారనున్నాయి. 2018కి ముందు నాలుగు నుంచి పదివరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే దానిని స్థానిక జిల్లాగా గుర్తించారు. ఇప్పుడు ఒకటి నుంచి ఏడు వరకు వరుసగా నాలుగేళ్లు ఏజిల్లాలో చదివితే దానిని స్థానికతగా నిర్ణయిస్తున్నారు. ఈ లెక్కన అభ్యర్థుల స్థానికత మారే అవకాశముంది. ఈ మేరకు ఉద్యోగార్థులు వారు గతంలో ఎక్కడ చదివారో ఆ పాఠశాలల నుంచి బోనాఫైడ్‌ (స్టడీ సర్టిఫికెట్‌) తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ పాఠశాలలు మూసివేయడంతో ఆందోళన చెందుతున్నారు.

ఓటీఆర్‌లో మార్పులు ఎలా?

ఉద్యోగార్థులు ప్రతి నియామక నోటిఫికేషన్‌కు పదేపదే వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా టీఎస్‌పీఎస్సీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) విధానాన్ని తెచ్చింది. ఇందులో అభ్యర్థి స్థానికత, జోన్‌ తదితర వివరాలన్నీ ఉంటాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఉద్యోగార్థుల సమాచారాన్ని సరిచేయాలని కమిషన్‌ భావిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ సహాయంతో సవరించాలా? వ్యక్తిగతంగా ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి సరిచేయాలా అనే విషయాల్ని పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తయితే కొత్త ఉద్యోగాలకు దరఖాస్తులో సాంకేతిక ఇబ్బందులను అధిగమించవచ్చని భావిస్తోంది. మరోవైపు నాలుగేళ్లుగా ఉద్యోగ విపణిలోకి కొత్తగా వచ్చిన యువత కమిషన్‌ వద్ద పేర్ల నమోదుకు ఎదురుచూస్తోంది.

అప్పుడు పూర్వజిల్లా.. ఇప్పుడు..?

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో 33 జిల్లాలు వచ్చాయి. గతంలో రెండు జోన్లు ఉంటే.. ఏడు అయ్యాయి. రెండు మల్టీజోన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త ఉత్తర్వుల మేరకు ఉద్యోగార్థి స్థానిక జిల్లాపై స్పష్టత వస్తే ఆ మేరకు జోన్‌, మల్టీజోన్‌ ఖరారవుతుంది. ఉదాహరణకు కరీంనగర్‌ జిల్లా నాలుగు కొత్త జిల్లాలైంది. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న-సిరిసిల్లగా మారింది. కొంత ప్రాంతం సిద్దిపేట, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల పరిధిలో కలిసింది. నాలుగు నుంచి పదివరకు వరుసగా నాలుగేళ్లు చదివిన ప్రాంతం ఆధారంగా గతంలో కరీంనగర్‌ స్థానిక జిల్లాగా ఉండేది. ఇప్పుడు జిల్లాలు మారడంతో చదివిన బడి దేని పరిధిలోకి వస్తుందో చూసుకుని ఆ మేరకు స్థానికత ఖరారు చేయాల్సి ఉంది. అంటే సగటున పూర్వ కరీంనగర్‌ జిల్లా స్థానికత కలిగిన అభ్యర్థి ఏడింటిలో ఏదో ఒకజిల్లా స్థానికతలోకి వెళ్లాల్సి వస్తుంది. జిల్లా స్థానికత ఖరారైతే ఏ జోన్‌లోకి వస్తారో తెలుస్తుంది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ పూర్వ జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల పరిస్థితి ఇలాగే ఉంది.

.

ఇవీచూడండి: competitive exam training fees: ఇవేమి 'శిక్షణ ఫీజులు' బాబోయ్​.. మేం మోయలేకున్నాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.