రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బి.జనార్దన్ రెడ్డి సహా మరో ఏడుగురు సభ్యులు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.45 గంటలకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఇంఛార్జి ఛైర్మన్ సాయిలు ప్రమాణం చేయిస్తారు.
టీఎస్పీఎస్సీ రెండో ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్ రెడ్డిని సర్కారు నియమించింది. నిబంధనల ప్రకారం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగానే.. జనార్దన్ రెడ్డి ఐఏఎస్ ఉద్యోగాన్ని కోల్పోతారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఇవాళ దరఖాస్తు చేసుకోనున్నారు. జనార్దన్‌రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించవచ్చు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా రమావత్ ధన్సింగ్, ఆచార్య బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారెం రవీందర్‌రెడ్డి, ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్.సత్యనారాయణలు బాధ్యతలు స్వీకరిస్తారు.
ఇవీచూడండి: యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్: జనార్దన్‌రెడ్డి