ETV Bharat / city

ఆ సహకార ఎన్నికలకు నోటిఫికేషన్​.. తెరాసకే అవకాశం - తెలంగాణ సహకార సంఘం ఎన్నికలు

రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ పాలకవర్గం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. సహకార ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

tscab
tscab
author img

By

Published : Mar 2, 2020, 11:30 PM IST

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ పాలకవర్గం ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థల ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఈ మేరకు తాజాగా రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వలు జారీ చేసింది. ఎన్నికల అధికారి ఎన్నికల నోటీసు జారీ చేయనుంది.

5న నామినేషన్లు

టీఎస్‌ క్యాబ్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవులకు పోటీపడే అభ్యర్థులు ఈ నెల 5న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేస్తారు. 11.30 గంటలకు నామినేషన్ల పరిశీలన, 12 నుంచి 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. అవసరమైతే... 3 నుంచి 5 గంటలకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు 5.30 గంటలకు కౌంటింగ్ చేసి విజేతలను ప్రకటిస్తారు.

అదేరోజు ఫలితాలు

తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ పాలకవర్గం ఛైర్మన్, ఇతర పాలకవర్గం ఎన్నికల సంబంధించి ఈ నెల 4న ఎన్నికల అధికారి నోటీసు జారీ చేస్తారు. ఈ నెల 7న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల దాఖలు, 1.30 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అదే రోజు 3.30 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. 10న ఉదయం 8 నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

ఏకగ్రీవమయ్యే అవకాశం

11న టీఎస్ మార్క్‌ఫెడ్ పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. టీఎస్ క్యాబ్, టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థల పాలకవర్గం ఎన్నిక ప్రక్రియంతా తెరాస అభ్యర్థులే ఏకగ్రీవం కానున్నారు. ఇప్పటికే ఆ పదవుల కోసం తెరాసలో ఆశావహుల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. రెండు కూడా కేబినెట్ హోదా పదవులు కావడంతో... ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ద్వారా తమ తమ ప్రయత్నాల్లో ఆశావహులు నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి: వైద్యం ఖర్చులు భరించలేక.. తండ్రే చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.