ఆరేళ్లుగా పదోన్నతులు లేక అర్హతగల ఉపాధ్యాయులు నష్టపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. రిటైర్మెంట్, మరణాలు తదితర కారణాల వల్ల 2000 ప్రధానోపాధ్యాయులు, 7000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 10479 పండిట్, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేశారని అన్నారు. ఇవన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సినవని తెలిపారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నియామకమై ఏడేళ్లైనా బదిలీలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని జంగయ్య ఆరోపించారు. తక్షణమే అన్ని యాజమాన్యాల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీవీ ద్వారా బోధించడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిందని, ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు.న్నారు. డీఏ వాయిదా జాప్యం లేకుండా విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించటాన్ని స్వాగతిస్తూ..బకాయి ఉన్న 2020 జనవరి, జులై డీఏ వాయిదాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు ఒకే రకంగా అమలు చేయాలని విన్నవించారు.
- ఇదీ చూడండి : స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్ఓ చీఫ్..