రాష్ట్రంలో గురుకులాల ప్రారంభం(GURUKUL SCHOOLS REOPENING)పై స్టే ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్(Telangana Government) హైకోర్టును కోరింది. గురుకులాలు తెరవద్దని గతంలో హైకోర్టు(Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వం.. స్టే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది.
కరోనా జాగ్రత్తలతో మిగతా పాఠశాలలు నడుస్తున్నాయని ఎస్జీపి హైకోర్టుకు(Telangana High Court) తెలిపారు. పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. బుధవారం రోజున పిల్ విచారణనను పరిశీలిస్తామని సీజే ధర్మాసనం తెలిపింది.