ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ, 13 లక్షల పోర్టబులిటీ లావాదేవీలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరమల్గూడ రేషన్ షాప్లో బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు.
ఇప్పటి వరకు 76 లక్షల కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని మారెడ్డి తెలిపారు. లాక్డౌన్తో పేదలు ఇబ్బంది పడకుండా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 88 శాతం బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
అత్యధికంగా హైదరాబాదులో 2.42 లక్షలు, మేడ్చల్లో 1.95 లక్షలు, రంగారెడ్డిలో 1.36 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా బియ్యం తీసుకున్నారని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో మొత్తం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అత్యంత వేగంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసిన అధికారులకు సిబ్బందికి రేషన్ డీలర్లకు అభినందలు తెలిపారు. మారెడ్డితో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ హరీశ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు.
ఇవీ చూడండి: పిల్లలను గంగానదిలో పారేసిన తల్లి- అయిదుగురు మృతి