ETV Bharat / city

ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్​ - ktr road show in jummerath bazar

దిల్లీ నుంచి పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు... కేసీఆర్​ సింహంలా సింగిల్​గా వస్తున్నారని కేటీఆర్​ అన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా జుమ్మేరాత్​ బజార్​లో రోడ్​ షో నిర్వహించారు. ప్రజలు ఉద్వేగాలకు లోనుకాకుండా తమ వెంట ఉండే నాయకులకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

trs working president raod shoe in jummerath bazar
ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్​
author img

By

Published : Nov 29, 2020, 4:28 PM IST

Updated : Nov 29, 2020, 4:57 PM IST

ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్​

రాష్ట్రంలో, జీహెచ్ఎంసీలో తెరాస గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్​ అన్నారు. జుమ్మేరాత్​ బజార్​లో రోడ్​ షోలో పాల్గొన్న కేటీఆర్​... హైదరాబాద్​లో ఇప్పుడు రౌడీలు, గుండాలు లేరని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త... ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో కంటైన్మెంట్​ జోన్​లు తిరిగి... కుటుంబానికి రూ.1,500, వరద బాధితులకు రూ.10 వేలు ఇచ్చాం. మిగిలిన వారికి డిసెంబర్ 7 తర్వాత ఇస్తామని స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను తెరాస ఓడిస్తుందని... ఉద్వేగాలకు లోను కాకుండా ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే... రాష్ట్రానికి సగమే ఇచ్చిందన్నారు. దిల్లీ నుంచి పెద్ద వాళ్లు వస్తున్నారు... కేసీఆర్​ మాత్రం సింహంలా సింగిల్​గా వస్తున్నాడని వ్యాఖ్యానించారు. భాజపా వాళ్లు డొనాల్డ్ ట్రంప్​ను కూడా తీసుకొచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

జన్​ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తాం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అన్నారు... ఇవన్నీ ఏమైయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. శత్రు దేశం మీద చేసే సర్జికల్ స్ట్రైక్​ను హైదరాబాద్​లో చేస్తామనడం సమంజసం కాదన్నారు. ఎన్నికలు వస్తే హిందూ-ముస్లిం అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎయిర్ ఇండియా, ఎల్​ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి తమ వెంట ఉండేవారికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కేసీఆర్ చేపట్టిన​ దీక్షకు నేటికి 11 ఏళ్లు​ పూర్తి

Last Updated : Nov 29, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.