తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పూర్తి స్పష్టతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను (trs leaders met governor) తెరాస నేతలు కోరారు. ఇందిరాపార్క్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మహాధర్నా అనంతరం తెరాస బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బృందంలో ఉన్నారు.
'ప్రభుత్వం ధర్నా చేయక తప్పని పరిస్థితి వచ్చింది..'
ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తమిళిసైకి (trs leaders met governor) వినతి పత్రం ఇచ్చిన నేతలు... పరిస్థితులను వివరించారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారన్న నేతలు... రాష్ట్ర గవర్నర్‌గా సంతోషించాల్సిన అంశమని అన్నారు.
గవర్నర్ ఆరా..
ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు, చర్చకు వచ్చిన అంశాలపై గవర్నర్ ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సహకారం అందిస్తున్నప్పటికీ... కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ రైతులను అయోమయానికి గురిచేస్తుందన్న నేతలు... రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం వారికి నష్టం కలిగితే (trs dharna today) ఎంత పెద్ద పోరాటానికైనా సిద్దమని అన్నారు. యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను కోరారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
'కొంటారో లేదో చెప్పండి..'
రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి... ధాన్యం కొంటారో (minister niranjan reddy) లేదో రైతులకు స్పష్టంగా చెప్పాలన్నారు. తమ విజ్ఞప్తిని కేంద్రానికి పంపిస్తామన్న గవర్నర్ తమిళిసై... రైతులకు సంబంధించిన అంశాల్లో గందరగోళం ఉండరాదని అన్నట్లు మంత్రి చెప్పారు.
కేంద్రంపై కేసీఆర్ ఫైర్..
మహాధర్నా సందర్భంగా (TRS Dharna news) కేంద్రంపై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అడ్డగోలు మాటలు మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. రైతుల గోస.. తెలంగాణలోనే కాదు దేశ్యవ్యాప్తంగా ఉందని తెలిపారు. ఏడాదిగా దేశవ్యాప్తంగా సాగు చట్టాలు వద్దని రైతులు నిరసన చేస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తోందని మండిపడ్డారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదని.. పండించిన పంట కొంటారా.. కొనరా అనే అడుగుతున్నారన్నారు. ఇది రైతుల జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. కర్షకులు నష్టపోకూడదనే తెరాస ఆరాటమని.. అందుకే తమ ఈ పోరాటమని స్పష్టం చేశారు. ప్రతిగ్రామంలో చావుడప్పు కొడతామని అన్నారు. పోరాటం చేయడంలో దేశంలో తెరాసను మించిన పార్టీ లేదని ఉద్ఘాటించారు.
ఇవీచూడండి: