ETV Bharat / city

ST Reservations: ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం తీరుపట్ల తెరాస ఎంపీలు ఫైర్ - ఎస్టీ రిజర్వేషన్ల పెంపు

TRS MPs on ST Reservations: గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశంలో కేంద్ర వైఖరిని తెరాస ఎంపీలు తప్పుపట్టారు. తెలంగాణ ప్రతిపాదనలు పంపలేదనటంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన తెరాస ఎంపీలు.. కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడును భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

TRS MPs on ST Reservations
గిరిజనశాఖ సహాయ మంత్రిపై తెరాస ప్రివిలేజ్ మోషన్
author img

By

Published : Mar 23, 2022, 1:22 PM IST

Updated : Mar 23, 2022, 2:13 PM IST

గిరిజనశాఖ సహాయ మంత్రిపై తెరాస ప్రివిలేజ్ మోషన్

TRS MPs on ST Reservations: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేశామని తెరాస ఎంపీలు స్పష్టం చేశారు. గిరిజనులకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్ భావించారని.. అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోంశాఖకు పంపారని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ సభను తప్పుదోవ పట్టించారని తెరాస ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీలో మీడియా సమావేశంలో ఎంపీలు మాట్లాడారు.

ఎస్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లు... తమకు అందలేదనటం చూస్తుంటే తెలంగాణపై కేంద్రానికి ఉన్న అక్కసుకు నిదర్శనమని... తెరాస ఎంపీలు ఆరోపించారు. తెలంగాణ ప్రతిపాదనలు పంపలేదనటంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు గిరిజనశాఖ సహాయ మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద లోక్​సభలో నోటీసులు ఇచ్చారు. వెంటనే కేంద్ర మంత్రిని భర్తరఫ్‌ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

"ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై 2017లోనే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోంశాఖకు పంపారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాం. ఐదేళ్లుగా ఆ బిల్లు గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. ఎన్నిసార్లు అడిగినా ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం ఇప్పుడు చెప్పడం దారుణం." -ఎంపీ నామ నాగేశ్వరరావు

పార్లమెంటు సాక్షిగా అబద్ధాలాడి.... కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సభను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్లపై ప్రధాని సహా... కేంద్ర మంత్రుల దృష్టికి సైతం తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. కేంద్రంలోని భాజపాకు తెలంగాణపై చాలా అక్కసు ఉందని ఆరోపించారు. గిరిజనుల కోసం రాష్ట్రప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని.. ఎస్టీ రిజర్వేషన్ల పెంపును సాధించే వరకు కేంద్రంపై పోరాడుతామని స్పష్టం చేశారు. కేంద్రం అన్ని విషయాల్లో తెలంగాణ ప్రజలను వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మేం కేంద్రానికి పంపింది ప్రతిపాదన కాదు, అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లును పంపాం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరాం. అసెంబ్లీ చేసిన తీర్మానానికి విలువ లేకుండా చేశారు. గిరిజనశాఖ సహాయ మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదిస్తాం." -కె. కేశవరావు, తెరాస ఎంపీ

ఇదీ చదవండి: బోయగూడ ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పీఎం, సీఎంల పరిహారం

Last Updated : Mar 23, 2022, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.