మెట్రో ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆక్షేపించారు. మెట్రో ప్రారంభోత్సవంలో పాటించాల్సిన ప్రోటోకాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం పాటించిందన్నారు. కిషన్ రెడ్డి హుందాగా ప్రవర్తిస్తే అది ఆయనకే మంచిదన్నారు.
కేంద్ర మంత్రులెవరైనా తమ రాష్ట్రాలకు నిధులు తీసుకుపోవాలని తాపత్రయపడతారని, కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణకు నిధులు ఇచ్చేదిలేదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తీసుకువస్తే ఆయనకు పౌరసన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.