ETV Bharat / city

'తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు..' - నరేంద్రమోదీ వ్యాఖ్యలపై తెరాస మంత్రుల స్పందన

Ministers Fire on Modi: తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే అన్న మోదీది అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు. వాట్సప్ యూనివర్సిటీలో కట్టు కథలు తయారు చేసి ప్రచారం చేస్తూ దేశంలో హింస రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

TRS Ministers Fire on modi comments
TRS Ministers Fire on modi comments
author img

By

Published : May 26, 2022, 8:55 PM IST

'తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు..'

Ministers Fire on Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై తెరాస మంత్రులు తీవ్రస్థాయిలో స్పందించారు. పర్యటనలో భాగంగా మోదీ కేసీఆర్​ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే అన్న మాటపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వాళ్లది పగటి కలే..: భాజపా అధికారంలోకి వస్తామనేది పగటికల అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదని మండిపడ్డారు. 8 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిందేంటో మోదీ చెప్పాలని మంత్రి డిమాండ్​ చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తెరాసనేనని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో గుజరాత్‌ కంటే వేగంగా దూసుకువెళ్తుందనే అక్కసుతోనే కేంద్రం తెలంగాణను అణచివేస్తోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

"భాజపా చేసేది గోరంత.. చెప్పేది కొండంత. గ్యాస్‌ సిలిండర్‌పై రాయితీ ఎత్తివేశారు. ఇది గుజరాత్‌ కాదు.. తెలంగాణ పోరాటాల గడ్డ. ఇతర పార్టీల నుంచి వారసులను భాజపాలో ఎందుకు చేర్చుకుంటున్నారు. వారసులను భాజపాలో చేర్చుకుంటే తప్పులేదా..? అదే వారసులకు ప్రజలు ఓట్లేసి గెలిచి వస్తే తప్పా..? మోదీ స్థాయికి తగని మాటలు మాట్లాడారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు ఉన్నారు.. నేడు ఉన్నారు. భాజపా నేతలే విచ్ఛిన్నకర శక్తులు. ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీ తప్పులు ఎత్తి చూపితే కుటుంబ పార్టీ అంటారా..?" - హరీశ్​రావు, మంత్రి

నరేంద్ర మోదీది అత్యాశే..: తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి.. తెలంగాణ అమరుల గురించి ఉచ్ఛరించే అర్హత లేదని మంత్రి నిరంజన్​రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భాజపాకు అసలు చోటే లేదని.. నరేంద్రమోదీది అత్యాశ అని వ్యాఖ్యానించారు. 4000 కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే ముఖం చాటేసిన మోదీ... 11 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ అప్పులు మాఫీ చేశారని తీవ్రంగా తప్పుపట్టారు. భాజపా హయాంలో దేశంలో ఎక్కడా పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదని... దేశ రైతుల ఉసురుపోసుకుని క్షమాపణలు చెప్పిన విఫల ప్రధాని మోదీ అంటూ విమర్శించారు

" కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయకుండా.. యువకుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. నిరంకుశత్వం, కుటుంబ పాలన అనే మాటలు మోదీ నోటి నుంచి వింటే నవ్వొస్తుంది. ముందు అమిత్ షా కుమారుడిని బీసీసీఐ నుంచి తొలగించి మాట్లాడాలి. ఎనిమిదేళ్ల పాలనలో లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిస్సిగ్గుగా తెగనమ్మి దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నారు. వాట్సప్ యూనివర్సిటీలో కట్టు కథలు తయారు చేసి ప్రచారం చేస్తూ దేశంలో హింస రెచ్చగొడుతున్నారు." -నిరంజన్‌రెడ్డి, మంత్రి

మోదీకి ప్రత్యామ్నాయం కేసీఆరే..: ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి గంగుల కమలాకర్‌ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడ్డారని.. నామినేటెడ్​గా రాలేదని స్పష్టం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకొని భాజపా రాజకీయం చేస్తోందని.. తెరాస మాత్రం అభివృద్దిని చూపిస్తూ ప్రజల ముందుకెళ్తుందని మంత్రి వివరించారు. గుజరాత్ రాష్ట్రం కన్నా అన్ని రంగాల్లో ముందున్నామనే కుట్రతోనే ప్రధాని మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేవున్ని గుండెల్లో పెట్టుకొని పూజించే నైజం తెరాసదైతే... ఆ దేవున్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసేది భాజపా అని ప్రజలందరికీ తెలుసన్నారు. మోదీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ అని దేశం భావిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మోదీ అసమర్థ పాలనను తరిమికొట్టేందుకు, దేశ ప్రజలకు మంచి చేసేందుకు యావద్దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్​ ప్రయత్నాలు చేస్తున్నారని.. దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారని మంత్రి వివరించారు.

భాజపాకు కేసీఆర్​ భయం..: భాజపాకు కేసీఆర్ భయం మొదలైందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. దేశం ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందన్నారు. తెలంగాణ అంటేనే మోదీకి వివక్ష అని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని కేసీఆర్​.. రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకుంటారా? అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

మోదీని గద్దె దింపడమే లక్ష్యం..: తెలంగాణపై వివక్ష చూపే నరేంద్ర మోదీ మాటలను రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం వినరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. యువత గురించి మాట్లాడిన మోదీ.. ఏడేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్క కళాశాల అయినా తెలంగాణకు ఇచ్చారా? అని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని అడిగారు. అన్ని పార్టీలతో ఏకమై ప్రధానిని గద్దె దింపడమే లక్ష్యమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే చాలు మత చిచ్చులు పెడుతారని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనకుండా కేసులు పెట్టించారని ఎర్రబెల్లి మండిపడ్డారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.