ETV Bharat / city

గ్రేటర్​ పోరు: బస్తీల్లో కారు జోరు... ప్రచారంలో నాయకుల హుషారు - జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచార వార్తలు

జీహెచ్​ఎంసీ పీఠంపై మరోసారి గులాబీజెండాను ఎగరేయడమే లక్ష్యంగా అధికార తెరాస అభ్యర్థులు, నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వ్యుహాత్మకంగా కారు పార్టీ ముఖ్యనేతలను ప్రజాక్షేత్రంలో మోహరించింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రస్తావిస్తూ ఇంటింటికి వెళ్లి తెరాస అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు. విపక్షాలకు అవకాశమిస్తే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందని విమర్శించారు.

trs leaders campaign in ghmc elections
trs leaders campaign in ghmc elections
author img

By

Published : Nov 25, 2020, 8:30 PM IST

బస్తీల్లో కారు జోరు... ప్రచారంలో నాయకుల హుషారు

బల్దియా ఎన్నికల ప్రచారంలో... తెరాస అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండడంతో... సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలుసుకునేలా ప్రణాళిక అమలుచేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి సర్కారు చేసిన పనులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రచార బరిలో దిగారు. మేయర్‌ పీఠం కైవసమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

మీర్‌పేట్‌ హౌసింగ్ బోర్డు డివిజన్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ప్రాంతం అభివృద్ధి చేయాలంటే మరోసారి గులాబీ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హిమాయత్‌ నగర్‌ తెరాస అభ్యర్థికి మద్దతుగా మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విస్తృతంగా పర్యటించారు. బషీర్‌బాగ్‌లో ఇంటింటికి వెళ్లిన నేతలు... కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గాజులారామారం గులాబీ పార్టీ అభ్యర్థి తరపున... లెనిన్‌నగర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస సంక్షేమ పథకాలే పార్టీని విజయపథాన నిలబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. చర్లపల్లి మూడో డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న మేయర్‌ సతీమణి బొంతు శ్రీదేవి జనం చెంతకెళ్తున్నారు. ఐదేళ్లుగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్న ఆమె.. వాటిని పూర్తి చేసేందుకు తనను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్​ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామర రక్ష అని... గన్‌ఫ్రౌండీ డివిజన్‌ తెరాస అభ్యర్ధి మమత తెలిపారు. బస్తీల్లో ఇంటింటికీ తిరిగిన ఆమె... కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. గులాబీపార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మంగళహాట్ డివిజన్ అభ్యర్థి పరమేశ్వరీ సింగ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పలు బస్తీలో ప్రచారం చేశారు. స్థానికులతో మాట్లాడిన నేతలు వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల్లో గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రహమత్‌నగర్‌ గులాబీ పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యరిస్తున్నారు. హైదరాబాద్ మరింతగా అభివృద్ది చెందాలంటే తెరాసకే పట్టం కట్టాలని... ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. సైదాబాద్ డివిజన్‌లో తెరాస అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి గెలుపును ఆశిస్తూ దివ్యాంగులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని కూర్మగూడ డివిజన్ తెరాస అభ్యర్థి మహేందర్ యాదవ్‌ హామీఇస్తూ ఓట్లు అడిగారు. కోట్లు ఖర్చుచేసి తెరాస సర్కారు హైదరాబాద్‌ అభివృద్ధికి కృషిచేస్తోందని జీడిమెట్ల గులాబీ పార్టీ అభ్యర్థి వెల్లడించారు. ఆ అభివృద్ధి భవిష్యత్‌లో అలాగే కొనసాగాలంటే గులాబీ పార్టీకి పట్టం కట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'మా నినాదం విశ్వనగరం.. ప్రతిపక్షాల నినాదం విద్వేష నగరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.