ETV Bharat / city

Mahila Bandhu Celebrations : తెరాస ఆధ్వర్యంలో ఘనంగా మహిళాబంధు సంబురాలు

author img

By

Published : Mar 6, 2022, 9:30 PM IST

Mahila Bandhu Celebrations : తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ నిర్దేశం మేరకు... మహిళా దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఏడున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం మహిళలకోసం ఎన్నో పథకాలు తెచ్చిందని వివరిస్తున్నారు. మహిళల భద్రత, సంక్షేమం సహా అన్ని విషయాల్లో సీఎం కేసీఆర్‌... అతివలకు అండగా నిలుస్తున్నారని నేతలు ఉద్ఘాటించారు.

Mahila Bandhu Celebrations
Mahila Bandhu Celebrations
తెరాస ఆధ్వర్యంలో ఘనంగా మహిళాబంధు సంబురాలు

Mahila Bandhu Celebrations : తెరాస ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళాబంధు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌ నిర్దేశం మేరకు మహిళా దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో మహిళా దినోత్సవాన్ని తెరాస ఘనంగా నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో పాటు హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, షీ టీమ్స్‌, భరోసా కేంద్రాలు ఇలా ఎన్నో పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలకు అండగా నిలిచారని మంత్రులు పేర్కొన్నారు.

మహిళలకు పెద్దపీట

తెరాస పాలనలో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో గాజులతో కేసీఆర్‌ చిత్రపటాన్ని రూపొందించి... మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌... రాష్ట్ర మహిళల కోసం తీసుకొచ్చారని పువ్వాడ గుర్తుచేశారు. మహిళ సంక్షేమంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

పోకిరీల ఆగడాలు తగ్గాయి

కేటీఆర్​ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా చౌటుప్పల్‌లో...మహిళా బంధు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల పట్ల పోకిరీల ఆగడాలు తగ్గాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. విద్యలో బాలికలకు అవకాశాలు పెరిగాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకనే మహిళలకు గౌరవం పెరిగిందని మహిళా సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాఠోడ్‌ అన్నారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిని మంత్రి పరిశీలించారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు సన్మానం చేశారు. బాలింతలకు కేసీఆర్​ కిట్లు అందించి వారితో సెల్ఫీ దిగారు.

ఆకట్టుకున్న మానవహారం

మహిళాబంధు వేడుకల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మానవహారం ఆకట్టుకుంది. అనేక పథకాలతో మహిళలకు దన్నుగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు... మానవహారంతో మహిళలు కృతజ్ఞతలు చెప్పారు. కేసీఆర్​ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పాల్గొన్నారు. కోరుట్లలో తెరాస ఆధ్వర్యంలో మహిళాబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడలో కేసీఆర్​ చిత్రపటానికి రాఖీలు కట్టి సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల ర్యాలీలు మానవహారాలతో కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి : 'కేసీఆర్​ కిట్లు, ఆర్థిక సాయంతో.. ప్రసూతి మరణాలు తగ్గాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.