ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రకరకాల నిరసన ప్రదర్శనల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చనిపోయిన నలుగురు ఆర్టీసీ కార్మికుల ఆత్మకు శాంతి కలగాలని జేబీఎస్ వద్ద మౌనం పాటించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఆర్టీసీ కార్మికులు ఒత్తిడికి లోనై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ డిపో ఎదుట బైఠాయించి వెంటనే కార్మికులకు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని... లేనిపక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తాము జీతాల కోసం పాకులాడటం లేదని ఆర్టీసీని బతికించడమే లక్ష్యంగా సమ్మెకు దిగామని వారు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే సహించబోమని చెప్పారు.
ఇవీ చూడండి: రేపటినుంచి డిపోల ఎదుట భాజపా ఆందోళనలు