ఆదివారం రాత్రి భాగ్యనగరంలోని పలుప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ప్రభావానికి గోల్కొండ వద్ద ఓ భారీ వృక్షం కొమ్మ.. పక్కనే ఉన్న కరెంటు తీగలపై పడింది. వాటిని తొలగించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం యత్నించింది. కరెంటు తీగ పైనుంచి కొమ్మను తీసే సమయంలో ప్రమాదవశాత్తు మరో కొమ్మ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనంపై పడింది. ప్రమాదంలో వాహనం పాక్షికంగా ధ్వంసమవ్వగా.. ఎవరూ గాయపడలేదు. గంట పాటు శ్రమించిన సిబ్బంది రెండు కొమ్మలను తొలగించారు.
అలా.. విపత్తు నిర్వహణ బృందం వాహనంపై కూలిన వృక్షం - undefined
ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలుల ప్రభావానికి గోల్కొండ వద్ద ఓ భారీ వృక్షం కొమ్మలు విరిగాయి. వాటిని తొలగిస్తున్న క్రమంలో చెట్టు విరిగి విపత్తు నిర్వహణ బృందం వాహనంపై పడింది.
![అలా.. విపత్తు నిర్వహణ బృందం వాహనంపై కూలిన వృక్షం ఈదురు గాలులకు కూలీన భారీ వృక్షం కొమ్మలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7911358-911-7911358-1594025844409.jpg?imwidth=3840)
ఈదురు గాలులకు కూలీన భారీ వృక్షం కొమ్మలు
ఆదివారం రాత్రి భాగ్యనగరంలోని పలుప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ప్రభావానికి గోల్కొండ వద్ద ఓ భారీ వృక్షం కొమ్మ.. పక్కనే ఉన్న కరెంటు తీగలపై పడింది. వాటిని తొలగించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం యత్నించింది. కరెంటు తీగ పైనుంచి కొమ్మను తీసే సమయంలో ప్రమాదవశాత్తు మరో కొమ్మ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనంపై పడింది. ప్రమాదంలో వాహనం పాక్షికంగా ధ్వంసమవ్వగా.. ఎవరూ గాయపడలేదు. గంట పాటు శ్రమించిన సిబ్బంది రెండు కొమ్మలను తొలగించారు.
TAGGED:
tree collapsed in golkonda