ETV Bharat / city

పెరిగిన కృష్ణా ఉద్ధృతి... గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు - prabhakar rao

కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నందున రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్​కో నిర్ణయించింది. కొన్నేళ్లుగా నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున అన్ని కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం ఉత్పత్తి చేయడం సాధ్యం కాలేదు.

పెరిగిన కృష్ణా ఉద్ధృతి... గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు
author img

By

Published : Aug 7, 2019, 10:31 PM IST

కర్ణాటక నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహ ఉద్ధృతి పెరిగినందున... రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్​కో నిర్ణయించింది. దీనిపై ట్రాన్స్​కో-జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు సమీక్షించారు. వారం రోజుల క్రితమే జూరాల, శ్రీశైలంలో ఉత్పత్తి ప్రారంభించారు. అప్పర్, లోయర్ జూరాలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా... ప్రవాహ ఉద్ధృతికి అనుగుణంగా వ్యూహాలు అనుసరించాలని అధికారులకు ఆయన సూచించారు.

నాగార్జునసాగర్, పులిచింతలలో ఉత్పత్తి వ్యవస్థలను జెన్​కో సిద్ధం చేసింది. నాగార్జునసాగర్​లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదలయితే పులిచింతలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా కృష్ణా నది ప్రవాహం తగ్గుతూ వస్తున్నందున... జూరాల నుంచి పులిచింతల వరకు కేంద్రాల్లో ఒకేసారి పూర్తి సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇటీవల కాలంలో సాధ్యం కావడం లేదు. ఈ సారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జెన్​కో సర్వసన్నద్ధమైది.

పెరిగిన కృష్ణా ఉద్ధృతి... గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు

ఇదీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'

TG_Hyd_66_07_Transco_Jenco_CMD_Review_AV_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫైల్‌ విజువల్స్ వాడుకోగలరు. ( ) కృష్ణా నదికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని హైడల్ పవర్ స్టేషన్లలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్ కో నిర్ణయించింది. ఇప్పటికే జూరాల, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన జెన్ కో.... నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యవస్థలను సిద్ధం చేసింది. తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ఆయా పవర్ స్టేషన్ల అధికారులు, జెన్ కో అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహ ఉధృతిని, రిజర్వాయర్లలో నీటి మట్టాలను సమీక్షించారు. వారం రోజుల క్రితం కర్ణాటక నుంచి నీటి ప్రవాహం ప్రారంభమయిన నాటి నుంచే జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని జెన్ కో ప్రారంభించింది. అప్పర్, లోయర్ జూరాల కలిపి 120 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదని... ప్రవాహ ఉధృతిని అనుసరించి, విద్యుత్ ఉత్పత్తి చేయాలని, ప్రతీ రోజు, ప్రతీ గంటా అప్రమత్తంగా ఉండి, ఆ సమాయానికి కావాల్సిన వ్యూహం అనుసరించాలని జూరాల విద్యుత్ ప్లాంట్ల అధికారులతో ప్రభాకర్ రావు చెప్పారు. నాగార్జున సాగర్ లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్ కో నిర్ణయించింది. నాగార్జున సాగర్ నుంచి కూడా నీరు విడుదలయితే పులిచింతలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్ కో నిర్ణయించింది. జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఒకేసారి పూర్తి సామర్థ్యం మేరకు జల విద్యుత ఉత్పత్తి చేయడం ఇటీవల కాలంలో సాధ్యం కావడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గుతూ వస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఈ సారి కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో, దీన్ని సానుకూలాంశంగా స్వీకరించి, అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేయడానికి జెన్ కో సర్వసన్నద్ధమయింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.