ETV Bharat / city

భార్య ఫిర్యాదు.. ట్రైనీ ఐపీఎస్​ సస్పెండ్​

author img

By

Published : Dec 14, 2019, 7:03 PM IST

ట్రైనీ ఐపీఎస్ మహేశ్వరరెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది కేంద్ర హోంశాఖ. మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత తనకు విడాకులు ఇచ్చి కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని ఆయన భార్య భావన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.

trainee ips maheshwar reddy suspended
trainee ips maheshwar reddy suspended

శిక్షణా ఐపీఎస్ మహేశ్వరరెడ్డిని కేంద్ర హోంశాఖ.. తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయన భార్య భావన హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గృహహింస, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది.

కేసు నుంచి విముక్తి పొందితే మళ్లీ ట్రైనీగా...

కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రైనీ ఐపీఎస్‌గా అవకాశం కల్పిస్తామని తెలిపింది. కడప జిల్లాకు చెందిన మహేశ్వర్‌ రెడ్డి సివిల్స్‌లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ముస్సోరీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో మిగతా శిక్షణా పూర్తి చేసుకోవాల్సి ఉంది.

8 ఏళ్ల ప్రేమ... ఏడాది క్రితం పెళ్లి

మహేశ్వరరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదివే సమయంలో కీసరకు చెందిన భావనతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 8 ఏళ్ల తర్వాత ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత తనకు విడాకులు ఇచ్చి కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని భావన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు

TG_HYD_52_13_IPS_MAHESWAR_REDDY_ISSUE_AV_36181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన భార్య నివాసం ఉండే దమ్మాయిగూడెం ఇంటి చిరునామా పేరు మీద లేఖ పంపారు. మహేశ్వరరెడ్డి వేదిస్తున్నారని ఆయన భార్య భావన కొన్ని నెలల క్రితం జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మహేశ్వరరెడ్డిపై వేదింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేశారు. మహేశ్వరరెడ్డిపై కేసులు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ లేఖ పేర్కొంది. కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రైనీ ఐపీఎస్ గా అవకాశం కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సంచాలకులు లేఖలో పేర్కొన్నారు. సివిల్స్ లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్ గా ఎంపికైన మహేశ్వరరెడ్డి ముస్సోరీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో మిగతా శిక్షణా పూర్తి చేసుకోవాల్సి ఉంది. నేర విచారణ పూర్తై ఎలాంటి కేసులు లేకుండా బయటపడితే తిరిగి బేసిక్ ట్రైనింగ్ లో చేర్చుకుంటామని కేంద్ర హోంశాఖ సంచాలకులు తెలిపారు. కడపకు చెందిన మహేశ్వరరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివే సమయంలో కీసరకు చెందిన భావనతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 8 ఏళ్ల తర్వాత ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది ఫిభ్రవరిలో వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లి విషయాన్ని మహేశ్వర రెడ్డి వాళ్లింట్లో చెప్పకుండా దాచిపెట్టాడని ఐపీఎస్ గా ఎంపికైన తర్వాత... తనకు విడాకులు ఇచ్చి కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని భావన ఫిర్యాదులో పేర్కొంది. పలు దళిత సంఘాలు ఆధ్వర్యంలో భావనకు మద్దతుగా ఉద్యమం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.