సచివాలయం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా సెక్రటేరియేట్ చుట్టుపక్కల రహదారులు మూసివేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు వెళ్లాలో తెలియక.. రోజూ వెళ్లే మార్గాల్లో పోలీసులు అనుమతించక.. వాహనాదారులు తలపట్టుకుంటున్నారు. కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
లిబర్టీ, ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను బీఆర్కే భవన్వైపు అనుమతించకపోవడం ఫలితంగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటుగా ఉన్న తమ కార్యాలయాలకు ఎలా వెళ్లాలంటూ వాహనదారులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.