ETV Bharat / city

లెక్కలు అడిగితే మంత్రికి కోపం వస్తోంది: ఉత్తమ్ - రాష్ట్ర ప్రభుత్వంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ తీరు, మంత్రుల ధోరణిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల గురించి ప్రశ్నిస్తే మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యక్తిగత దూషణకు దిగారని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగానైనా రైతులకు పూర్తి రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
author img

By

Published : Jun 1, 2020, 5:49 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. లెక్కలు అడిగితే మంత్రికి కోపం వస్తుందని ఎద్దేవా చేశారు. ఆరేళ్లుగా రైతులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ రోజైన రైతులకు పూర్తి రుణమాఫీ అనే తీపికబురు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌కు ముందు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట బీమాలో తన వాటా కట్టనందునే రూ.4,500 కోట్ల పరిహారం రాలేదని విమర్శించారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఇవీ చూడండి: 14 ఖరీఫ్​ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.