ETV Bharat / city

'కవితపై సీబీఐ, ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు'

Revanth Reddy Comments తెరాస, భాజపా ప్రభుత్వాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, ఎంపీలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ - కేసీఆర్ చీకటి ఒప్పందంలో భాగంగానే ఆయా పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉపఎన్నికల వేళ ఓట్ల కోసం కొత్తగా విద్యుత్‌ బకాయిల లొల్లిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.

TPCC Chief Reanth reddy and uttam kumar reddy fire on TRS and BJP leaders

author img

By

Published : Aug 30, 2022, 3:16 PM IST

Updated : Aug 30, 2022, 3:38 PM IST

కవితపై సీబీఐ, ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కాంగ్రెస్​ నేతలు

Revanth Reddy Comments: తెరాస, భాజపా ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఆ పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, ఎంపీలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తెరాస ఎంపీలు సభకే హాజరుకాలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చెల్లించిన డబ్బును పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌ ఖర్చు చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని త్వరలో ఏఐసీసీ ప్రకటిస్తుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కసరత్తు టీపీసీసీ స్థాయిలో పూర్తయిందని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను ఏఐసీసీకి పంపినట్లు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే రాజాసింగ్‌ను భాజపా ఆయుధంగా ఉపయోగించుకుంటుందని ఎంపీ ఉత్తమ్‌ ఆరోపించారు. ఉపఎన్నికల వేళ ఓట్ల కోసం కొత్తగా విద్యుత్‌ బకాయిల లొల్లిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.

"కవిత మీద బీజేపీ ఎంపీలు లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ, ఈడీ మరి ఆమె ఇంటికి ఎందుకు వెళ్లడం లేదు. భాజపా బ్లాక్ మెయిల్ చేసి ప్రొటెక్షన్ మనీ సంపాదిస్తోంది. రాహుల్ పాద యాత్ర చేస్తున్నారు.. మోదీ మోకాళ్ల యాత్ర చేస్తారా? బంగాల్‌ మోడల్ ఇక్కడ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో తెరాస, భాజపా డ్రామాలు చేస్తున్నాయి. బండి పాద యాత్ర వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం లేదు. ఆయనకు మోకాళ్ల చిప్పలు అరుగుతాయి. ఉపఎన్నికల ముంగిట విద్యుత్ బకాయిల పేరిట తీట పంచాయితీ తెచ్చారు. ఆగస్టు 8న మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. చీకటి ఒప్పందం కారణంగా తెరాస ఎంపీలెవరూ పార్లమెంటుకు రాలేదు. ఉభయకుశలోపరి మాదిరిగా భాజపా-తెరాస ఒకరినొకరు తిట్టుకుంటున్నారు." - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

"గులాం నబీ ఆజాద్​కు 50ఏళ్ల అనుభవం ఉంది. కాంగ్రెస్ నుంచి అత్యధిక బెనిఫిట్ పొందిన వ్యక్తి ఆజాద్. రాజ్యసభ పొడిగించలేదని ఆజాద్ ఇలా మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబంపై ఆయన చేస్తున్న వ్యాఖలను ఖండిస్తున్నాం. రాజాసింగ్ మాట్లాడిన మాటలు మతకల్లోలాలకు దారితీసేలా ఉన్నాయి. రాజాసింగ్​ను భాజపా ఆయుధంగా వాడుతుంది. స్పీకర్ వెంటనే రాజాసింగ్​ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి రాజాసింగ్​ను శిక్షించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ, ఈడీ ఎంక్వయిరీ వేయాలి. 8ఏళ్లుగా కేంద్రంలో ఉన్న భాజపా ఏం చేస్తుంది? విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్​లు విఫలమయ్యాయి. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీపై కూడా పార్లమెంట్​లో అడిగితే మాటేలేదు." - ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎంపీ

ఇవీ చూడండి:

Last Updated : Aug 30, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.