Congress Dharna at Indira Park 2021 : హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శని, ఆదివారాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘వరి దీక్ష’ చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. తెరాస ఎన్నారై సెల్ అమెరికా విభాగం కన్వీనర్, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన అభిలాష్‌రావు అనుచరులతో కలిసి గురువారం కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా రేవంత్ గాంధీభవన్‌లో మాట్లాడారు.
Revanth reddy comments on KCR : కేసీఆర్ తెలంగాణ ద్రోహి, రైతు ద్రోహి అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రెండోసారి సీఎం అయ్యాక ‘రాష్ట్రంలో వేల మంది రైతులు చనిపోయారు..కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదు కానీ దిల్లీలో చనిపోయిన రైతులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇదేం న్యాయం’ అని ప్రశ్నించారు. కేసీఆర్ దిల్లీకి వెళ్లి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస, భాజపా కలిసి రైతులకు ద్రోహం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
TPCC President Revanth On Paddy Procurement : ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజానికి బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. ఈ యాత్రలతో అయ్యేది లేదు... పొయ్యేదీ లేదని వ్యాఖ్యానించారు. తెరాస, భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు. కల్లాల్లో ధాన్యం కొనకుండా దిల్లీలో యాసంగి పంటపై డ్రామాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలులో జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి కర్షకుడు నష్టపోతున్నాడని వాపోయారు.
Revanth comments on KCR Government : రైతుల ఒత్తిడితోనే వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనమని ఒత్తిడి చేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖనే నేడు వరి రైతుల పాలిటి ఉరితాడైందని విమర్శించారు. కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతుల ఆవేదననే తాను మాట్లాడుతున్నానన్న రేవంత్ రెడ్డి.. భాజపా, తెరాసలు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ది చేసే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చారు. పార్టీలో చేరిన అభిలాష్‌రావు, నాయకులు మల్లు రవి, చిన్నారెడ్డి, శివసేనారెడ్డి తదితరులు మాట్లాడారు.