1. ఆర్నెళ్ల తర్వాతే..
సీడబ్ల్యూసీ భేటీలో సోనియా, రాహుల్‌పై సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారని కాంగ్రెస్ నేత పీఎల్ పూనియా తెలిపారు. పార్టీని మరికొంతకాలం నడిపించాలని సభ్యుందరూ కోరగా.. సోనియా అంగీకరించారని స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆర్నెల్ల లోపు మరో భేటీని నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఒకటో తారీఖు నుంచి
ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ పాఠాలు మొదలు కానున్నాయి. డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా 5 నెలలుగా రాష్ట్రంలోని సుమారు 40 వేల బడులు మూతపడ్డాయి. జూన్ 1 నుంచే పలు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు జూమ్, స్కైప్, వేబెక్స్ వంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ తరగతులు మొదలు పెట్టాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆంక్షలేల.. వేధింపులేల..?
గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా భాజపా, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇతర మతాలకు లేని ఆంక్షలు హిందు పండుగలపై ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విధానాలు మార్చుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకోతో పలు పట్టణాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మళ్లీ భేటీ..
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పంద సమావేశం ఎటూ తేలకుండానే ముగిసిపోయింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఇవాళ ఉదయం 11 గంటలకు బస్ భవన్లో భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఫ్రీ.. ఫ్రీ..
జ్వరం, దగ్గు, జలుబు, వంటి నొప్పులు సహా ఇంకా శరీరంలో ఏదైనా మార్పులు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కొవిడ్ వార్డును సందర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. బరిలో తెజస..!
దుబ్బాక ఉపఎన్నిక, పట్టభద్రుల ఎన్నికల బరిలో దిగేందుకు తెజస సిద్ధమైంది. నాంపల్లిలోని తెజస కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఖట్టర్‌కు కరోనా
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'మార్క్'..
అమెరికాలో టిక్‌టాక్ నిషేధం దిశగా పడుతున్న అడుగుల వెనుక ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ఈ వాదనలకు మరింత ఊతమిస్తోంది. ఆ కథనంలో ఏముంది? టిక్‌టాక్‌పై మార్క్ జకర్బర్గ్ వ్యక్తం చేసిన ఆందోళనలు ఏమిటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. తర్వాత కోహ్లీనే..
సచిన్ 'నూరు శతకాల'ను ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ దాటేస్తాడని చెప్పిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. భవిష్యత్‌లో అతడు మరిన్ని రికార్డులను సృష్టించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. బాలు హెల్త్ బులెటిన్
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు బులెటిన్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.