ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jul 4, 2020, 8:58 PM IST

topten news @9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM

1. 1,850 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి మరింత ఉద్ధృతమవుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ప్రజల్లో తీవ్ర కలవరం రేపుతోంది. తాజాగా శనివారం 1850 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొత్తం 6427 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1850 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 4577 నెగెటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,312కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. భారత్​ విధానాలు భేష్

కొవిడ్​-19 మహమ్మారిని కట్టడి చేయటంలో భారత్​ చేపడుతున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసించింది. లాక్​డౌన్​, అన్​లాక్​ విధానాలు వ్యవస్థీకృతంగా ఉన్నాయని.. ఇదే విధానాన్ని ప్రపంచ దేశాలు పాటించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. భారత్​పై చైనా డేటా అస్త్రం

భారత్​కు వ్యతిరేకంగా చైనా సమాచార ఆయుధాన్ని ప్రయోగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికతను భారతీయులపై నిఘా సాధనాలుగా ఉపయోగించుకుంటోందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కీలకమైన టెలికాం, సమాచార సాంకేతికత, కమ్యూనికేషన్ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే చైనాను ఎదుర్కొవడానికి ఉన్న ఏకైక మార్గమని తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సింధూ నదికి మోదీ ప్రత్యేక పూజలు

లద్దాఖ్​లో​ ఆకస్మిక పర్యటన అనంతరం శుక్రవారం సింధూ నదిలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్​లో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. 'ఆత్మనిర్భర్​' ఛాలెంజ్

చైనా యాప్​లను నిషేధించిన నేపథ్యంలో దేశీయంగా ప్రపంచ స్థాయి యాప్​ల​ను రూపొందించేందుకు ముందుకు రావాలని అంకుర సంస్థలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఆత్మనిర్భర్​ భారత్​ యాప్​ ఇన్నోవేషన్​ ఛాలెంజ్​లో పాల్గొనాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. నిర్మాణ రంగానికి అండగా ఉంటాం

కరోనా సంక్షోభం, లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిమాణాల నేపథ్యంలో హైదరాబాద్ నిర్మాణరంగాన్ని గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణరంగ ప్రతినిధులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. నిర్మాణరంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. రాష్ట్ర ప్రభుత్వం విఫలం

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో జరిగిన భాజపా జన్ సంవాద్ సభలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. శ్రీవారి ఆలయ గోపురాలపై మెుక్కలు

తిరుమల పుణ్యక్షేత్రంలో తితిదే అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. శ్రీవారి ఆలయంలోని ప్రధాన గోపురాలపై మెుక్కలు పెరుగుతున్నా.. వాటిని అధికారులు చూస్తూ ఉంటున్నారు తప్ప తొలగించట్లేదు. వేర్ల ద్వారా పగుళ్లు ఏర్పడి గోపురానికి ముప్పువాటిల్లే ప్రమాదముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ప్రియాంకకు అభిమాని ఆఫర్

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీకి ఓ అభిమాని తన ఇంటిని ఆఫర్ చేశాడు. ప్రభుత్వం కేటాయించిన గృహాన్ని ఖాళీ చేయాలని కేంద్రం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తన ఇంటిని వినియోగించుకోవాలని ప్రియాంకను కోరాడు. ప్రియాంక కుటుంబ సభ్యులందరికీ అవసరమయ్యే సదుపాయాలు ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఏడున్నర నిమిషాల వీడియోలో..

తన 20 ఏళ్ల కెరీర్​ గురించి రూపొందించిన ఓ వీడియోను ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది. ఇందులో ఆమెకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాల్ని పొందుపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.