ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9AM
టాప్​టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : Dec 16, 2020, 8:58 AM IST

1. త్వరలో చర్చలు

వేతన సవరణపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చించనున్నారు. ప్రగతిభవన్‌ నుంచి వారికి త్వరలో పిలుపు అందనుంది. పీఆర్‌సీ సన్నద్ధతపై సీఎం కార్యాలయం నుంచి ఆర్థిక శాఖకు తాజాగా సమాచారం అందింది. దీంతో అది వివిధ రకాలుగా కసరత్తు చేసి అతి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు వేతన సవరణ సంఘం సైతం తుది నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సీజేల బదిలీ..

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఏకకాలంలో బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను.. ఉత్తరాఖండ్ హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పంపుతున్నట్లు సమాచారం. వీరి స్థానంలో తెలంగాణ హైకోర్టుకు.. దిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీని, ఏపీ హైకోర్టుకు సిక్కిం ప్రధానన్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. గ్రీన్​ సిగ్నల్..

రాష్ట్రంలోని జాతీయ రహదారులకు ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. హైవేలను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం... రోడ్ల విస్తరణ, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. 7 వేల 233 కోట్లతో 289 కిలోమీటర్ల జాతీయ రహదారుల పనులను ప్రారంభించనుంది. అందులో భాగంగా యాదాద్రి-వరంగల్ మార్గంలో సుమారు 1,890 కోట్లతో చేపట్టనున్న 99 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల పొడవు గల రోడ్డును... ఈ నెల 21న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మార్గశిర విశిష్టత

శ్రీమన్నారాయణుడి ఆరాధనతోపాటూ పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీపూజలూ, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఏడో విడత..

జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఏడో విడత పోలింగ్​కు రంగం సిద్ధమైంది. 33 డీడీసీ నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరగనుంది. దీంతోపాటు ఖాళీగా ఉన్న 69 సర్పంచ్, 438 పంచ్ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. విషతుల్యం..

శరీరంలోని అవయవాలు పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేయాలంటే రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు అవసరం. అయితే మనం తాగే నీరు పరిశుభ్రంగా కూడా ఉండాలి. కానీ దేశంలో వేలకొద్దీ గ్రామాలు సాధారణ నీటి వసతికీ దూరంగానే ఉన్నాయి. 2016 'వరల్డ్‌ వాటర్‌ ఎయిడ్‌' నివేదిక ప్రకారం మనదేశంలో రక్షిత మంచినీటి లభ్యత అంతంత మాత్రమే. స్వచ్ఛమైన తాగునీరు లభించడం కూడా మహాభాగ్యంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అయిదేళ్లలో వందకోట్లు..!

వచ్చే అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా వంద కోట్ల మొబైల్​ ఫోన్లను తయారు చేయడంమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని సంకల్పించుకున్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సవాళ్ల సవారీ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​ విజయం ఇప్పటికే.. తేలినా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఠలాయింపుతో ఇంతకాలం రాజ్యమేలిన ప్రమాదకర ప్రతిష్టంభనకూ తాజాగా తెరపడింది. ఎలక్టోరల్‌ కాలేజీలోనూ బైడెన్‌ 306 ఓట్లు సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బలాన్ని నమ్ముకోండి..

డేనైట్​ టెస్టు​లో ఆసిస్​ జట్టుకే విజయావకాశాలు ఎక్కవగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి కపిల్​ దేవ్​. ఫ్లడ్​లైట్ల​ వెలుతురులో ఎలా ఆడాలో కంగారూల జట్టుకు బాగా తెలుసు అని చెప్పారు. ఆస్ట్రేలియా పిచ్​లపై పేస్​ బలాబలాల్ని అర్థం చేసుకుని టీమ్​ఇండియా బంతులు విసరాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పకోడి సీన్​..

సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో నటించి కొందరు నటులు తమ పాత్రలను నిజజీవితాలకు అన్వయించుకుంటారు. విలక్షణ నటి సూర్యకాతం కూడా ఈ మాదిరిగానే ప్రవర్తించి అందరినీ భయపెట్టిన సందర్భం ఒకటుంది. పకోడీల కోసం ఉగ్రరూపం చూపిన ఆ సన్నివేశం మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.