1. తగ్గుతున్న కేసులు
రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,78,108 చేరింది. వైరస్‌తో ఇప్పటి వరకు 1,496 మంది మృతి చెందారు. 24 గంటల్లో 631 మంది కోలుకోగా... 2,69,232 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఉద్యోగాల జాతర!
రాష్ట్రంలో కొలువుల జాతర మొదలుకానుంది. నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీపై ఆదివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్... 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఖాళీల వివరాలతో జాబితాను తయారుచేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నేడే ప్రారంభం..
సుదీర్ఘ విరామం అనంతరం వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయి. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు మొదలవుతున్న నేపథ్యంలో... ఇప్పటికే చాలా మంది స్లాట్లు బుక్ చేసుకున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సౌకర్యాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నిరాహార దీక్ష
సాగు చట్టాల రద్దు ఏకైక డిమాండ్‌గా నేడు రైతు సంఘాలు నిరహార దీక్ష చేపట్టాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. దిల్లీలోని నిరసన ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తగ్గించండి..
కొవిడ్ నిర్ధరణ చేస్తున్న పరీక్షలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎక్కువగా యాంటీజెంట్ పరీక్షలు నిర్వహిస్తుండగా... వాటిని తగ్గించి, ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ కార్యదర్శి బలరాం భార్గవ సంయుక్తంగా లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. త్వరలో ఆల్గే..
'ఆల్గే' అంటే ఒక శైవలం అని మాత్రమే తెలుసు. ఆల్గేను త్వరలో ఆహార పదార్థంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. శరీర వృద్ధికి తోడ్పడే ఈ మేలు రకం శైవలాన్ని.. విదేశీయులు విస్తృతంగా వాడుతున్నారు. అయితే.. ఈ ఆల్గే వల్ల ఉపయోగాలేంటి? దాని వల్ల శరీరానికి ప్రయోజనమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఎస్వాతీనీ ప్రధాని మృతి
ఆఫ్రికా దేశం ఎస్వాతీనీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో డ్లామిని(52) మరణించారు. నాలుగు వారాల క్రితం కరోనా బారినపడిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఎస్వాతీనీ ఉప ప్రధాని థెంబా మసుకు అధికారిక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సగటున 7 గంటలు..
లాక్డౌన్ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో గడిపే సమయం బాగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చాలా మంది భారతీయులు.. ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లో వెచ్చిస్తున్నట్లు తేలింది. ఈ ఏడాదిలో సగటు స్మార్ట్‌ఫోన్ వినియోగం 25 శాతం పెరిగి, దాదాపు 7 గంటలకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అలా చేస్తే బలపడతాం..
ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో మయాంక్‌తో పాటు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను పంపించాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా. అతడికి అవకాశమివ్వడం వల్ల టీమ్ఇండియా ఓపెనింగ్ మరింత బలంగా తయారవుతుందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రానాతో నటించడం..
చిత్రసీమలో.. లింగ అసమానతల విషయంలో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయని చెప్పారు హీరోయిన్ సాయిపల్లవి. హీరో రానా సమానత్వాన్ని విశ్వసించే వ్యక్తి అని కొనియాడారు. 'విరాఠపర్వం' సినిమాలో ఆయనతో కలిసి నటించడం గొప్ప అనుభవమని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.