1. హోరాహోరీ..
శతాబ్దంలో ఎరుగని విధంగా అమెరికాలో ఓటింగ్ శాతం నమోదయ్యేలా కనిపిస్తోంది. 67 శాతం మంది ఓటర్లు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగమైనట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పలు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అన్నదాతల ఆవేదన
అప్పటి దాకా ఉపాధి నిచ్చిన ఆటో లాక్డౌన్ దెబ్బకు ఆగిపోయింది.. పల్లెకొచ్చి వ్యవసాయం ప్రారంభించిన ఆ యువకుడికి వర్షాలు మిగిల్చిన నష్టం అక్షరాలా రూ.6 లక్షలకు పైనే..గత మార్చిలో వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోయి ఎన్నో ఆశలతో ప్రస్తుత వానాకాలంలో వరి సాగుచేసిన ఓ అన్నదాత చేనును చెరువు ముంచేసింది. ఇప్పటీకీ నీటిలోనే మునిగిఉన్న పైరుపై ఇక ఆశలు వదిలేసుకున్నారు..వీరిద్దరే కాదు.. రాష్ట్రంలో భారీ వర్షాలకు పూర్తిగా ‘మునిగిపోయిన’ బాధిత రైతులెందరో.. అతివృష్టి మిగిల్చిన అగాథంపై వారిని కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నష్టాలు వీడేనా..!
కరోనా దెబ్బకు కుదేలైన ఆర్టీసీ... గడిచిన 7 నెలల్లో రూ. 1,579 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. మే 19 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినప్పటికీ... ప్రజలు ప్రయాణించకపోవడం వల్ల నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మే నుంచి అక్టోబర్ వరకు క్రమంగా ఆదాయం పెరుగుతూ వస్తున్నా... సంస్థ ఇంకా నష్టాల్లోనే ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు ప్రారంభం కావడం... ఆదాయం మరింత పెరుగుతుందని సంస్థ యాజమాన్యం అశాభావం వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కనులవిందు
అద్భుత కళాఖండాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా కనీవినీ ఎరుగని రీతిలో నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ వీడియోను వైటీడీఏ అధికారులు విడుదల చేశారు. సప్తరాజ గోపురాలు, అష్టభుజి మండప ప్రాకారాలు, పూర్తిగా కృష్ణ శిలతో ఆలయ పునర్నిర్మాణం, వివిధ నారసింహ రూపాలు, దేవతా విగ్రహాలు, పద్మాలు, యాలీ పిల్లర్లతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఆలయ అందాలు, అద్భుత కళాఖండాలను చూపించే దృశ్యమాలిక భక్తులకు కనువిందు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'నేపాల్ ఆర్మీ జనరల్'గా నరవాణే!
సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు కీలక ద్వైపాక్షిక అంశాలు చర్చించటానికి భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం నరవాణే నేడు నేపాల్ చేరుకోనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అక్కరకు రానీ ఉద్దీపన
లాక్డౌన్లతో చతికిలపడి, భవిష్యత్తు అగమ్య గోచరమై అలమటిస్తున్న ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు చేస్తున్న కృషి అరకొరగానే ఉందని ఇటీవలి పరిణామాలు చాటుతున్నాయి. లఘు పరిశ్రమలకు చేయూతగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 20 శాతం రుణం అదనంగా అందించాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించినప్పటికీ.. అందులో సగం కూడా మంజూరు కాలేదని ప్రభుత్వ గణాంకాలే చాటుతున్నాయి. 'కొల్లేటరల్ సెక్యూరిటీ'తో నిమిత్తం లేకుండా అదనపు రుణం మంజూరు చేయాల్సిన బ్యాంకులు అందుకు నిరాకరిస్తుండటం మూలాన భారీ ఉద్దీపన స్ఫూర్తి మసకబారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. సెంట్రల్ విస్టా మంచిదే..
దిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ఉపయోగకరమేనని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ఈ నిర్మాణంతో పలు మంత్రిత్వ శాఖ చెల్లిస్తున్న అద్దె ఆదా అవుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఎప్పటికీ పదిలమే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 1876 రికార్డు ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో 81.8 శాతం మంది ఓట్లు వేశారు. ప్రస్తుత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైనప్పటికీ ఆ రికార్డును చేరుకోవటం అసాధ్యమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. టీవీలో కూడా చూడలేదు.. కానీ
థాయ్‌లాండ్ అనగానే పర్యటక ప్రదేశంగానే అందరికి గుర్తుస్తుంది. కానీ.. యుద్ధ విద్యలకు సంబంధించిన ఆటలే ఈ దేశంలో ఎక్కువ. ఇక ఆసియా దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న క్రికెట్ గురించి ఒకప్పుడు ఇక్కడ ఊసే లేదు. అందులోనూ కనీసం టీవీల్లోనూ మ్యాచ్‌లను చూసే అవకాశమే లేదు. అలాంటి గడ్డ నుంచి వచ్చిన ఓ అమ్మాయి లైవ్‌లో క్రికెట్ ఆడే అవకాశాన్ని సంపాదించింది 24 ఏళ్ల థాయ్‌లాండ్ బ్యాటర్ ఆమే నటకాన్ చాంటమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మరో హీరో ఎవరు?
మలయాళీ హిట్ చిత్రం..'అయ్యప్పనుమ్ కోశియుమ్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నారు పవన్ కల్యాణ్. మరి ఇందులో పవర్‌స్టార్‌తో పాటుగా నటించే మరో కథానాయకుడెవరు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.