1. మరో మూడు రోజులు..
ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే నగరవ్యాప్తంగా మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మళ్లీ ముంచింది..
హైదరాబాద్‌ను వరుణగండం వెంటాడుతోంది. కుంభవృష్టి నుంచి మహానగరం కోలుకోక ముందే మరోసారి వర్షం హడలెత్తించింది. వరద గుప్పిట నుంచి బయటపడకుందే.. క్యుములోనింబస్ మేఘాల రూపంలో మరోసారి విరుచుకుపడిన వాన నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలను వరద వణికించింది. ఏరులైన పారిన వరదతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి వాహనాదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 11 ఏళ్ల తర్వాత..
కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. శ్రీశైలంలోకి 7 లక్షల క్యూసెక్కులు దాటి ప్రవాహం వచ్చింది. అక్టోబరులో ఇంత భారీ వరద రావడం అరుదే. 2009 అక్టోబరులో శ్రీశైలం చరిత్రలోనే అత్యధికంగా 17.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. బ్యాక్‌వాటర్ ప్రభావంతో కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సుమారు 25 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి ఉండొచ్చని అప్పట్లో నీటిపారుదల శాఖ అంచనావేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సాయంత్రం నుంచే..
విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల ఏటా ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వేలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన వరకు సజావుగా కౌన్సెలింగ్ జరుగుతున్నా.. వెబ్ ఆప్షన్లకు వచ్చే సరికి చివరి క్షణం వరకు ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి, అనుబంధ గుర్తింపు ఇవ్వకపోతుండటం వల్ల తీవ్ర ఆందోళన తప్పడం లేదు. ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఇవాళ సాయంత్రం నుంచి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. నిర్భయంగా నిర్ణయాలు..!
‘‘న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టంచేశారు. ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఉన్న గొప్ప బలమన్నారు. నమ్మకం, ఆమోదయోగ్యతలు బలవంతపెడితే రావని.. వాటిని సంపాదించుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. బిహార్ సీఎం ఆయనే..
బిహార్‌లో ఎన్నికల హడావిడి మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రచారాస్త్రాలతో జోరు మీదుంది భాజపా. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన భాజపా సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారీ డిస్కౌంట్లు..
ఇంటికి కొత్త కారు వస్తే ఆ ఆనందమే వేరు.. ఇక పండగ వేళలో అయితే.. చెప్పక్కర్లేదు.. కార్ల సంస్థలు ఇదే అదనుగా తమ విక్రయాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. వాహనదారులను ఆకట్టుకునేందుకు పలు రకాల ఆఫర్లు, ప్రత్యేక రాయితీలతో ముందుకొస్తున్నాయి. పండగల బోనస్‌లు, పాత కార్లను మార్చుకుంటే ప్రత్యేక రాయితీలు, కార్పొరేట్ డిస్కౌంట్లు, కొవిడ్-19 పోరాటయోధులకు ఆఫర్లలాంటివీ ఈ సారి ప్రత్యేకంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. అవకాశం లేకనే..
దిల్లీ గెలవడానికి ధావన్ బ్యాటింగ్ కారణమని చెప్పిన సీఎస్కే కెప్టెన్ ధోనీ.. వేరే అవకాశం లేకపోవడం వల్లే జడేజా చివరి ఓవర్ వేశాడని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సోనూసూద్ బయోపిక్
తనపై బయోపిక్ తీస్తే అందులో తానే నటిస్తానని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు సోనూ సూద్. తనకన్న ఇంకెవరూ ఆ పాత్రను బాగా చేయలేరని ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఇద్దరు బామలతో 'చెక్'
నితిన్ 'చెక్' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నవంబరు 5 వరకు ఈ షెడ్యూల్ సాగుతుందని నిర్మాత చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.