ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9am
టాప్​టెన్ న్యూస్ @9am
author img

By

Published : Oct 6, 2020, 8:59 AM IST

1.నీటి భేటీ..!

నదీజలాల వివాదాలపై అత్యున్నత మండలి రెండో సమావేశం నేడు మధ్యాహ్నం జరగనుంది. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల నేపథ్యంలో జరుగుతున్న భేటీ ఆసక్తిరకంగా మారింది. రాష్ట్ర ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వాదనను తిప్పికొట్టడంతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాగా కేటాయింపులు చేయాలని, గోదావరి జలాల్లో అదనంగా నీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మళ్లీ బ్యాలెట్టే..

త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్ని బ్యాలెట్‌ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు వద్దని మెజార్టీ రాజకీయ పార్టీలు తేల్చి చెప్పడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుని సోమవారం ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. చీరలు రెఢీ..

అక్టోబర్ 17 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా నిరుపేద మహిళలకు ఉచితంగా అందజేసే బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలకు చేరాయి. ఈ నెల 9 నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాలు, నగరాలు, పట్టణాలు, మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ జరగాలని కలెక్టర్లకు సర్కారు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. నేడు స్పష్టత..?

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్​ పార్టీ మంగళవారం అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉంటూ మరణించిన రామలింగారెడ్డి భార్యకు తెరాస టికెట్​ ఖరారు చేసింది. ఇప్పటికే ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు ప్రచారం జరిగగా.. ఈ విషయమై కాంగ్రెస్​ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. నేడే విడుదల

ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 9న ప్రారంభం కానుంది. నవంబరు 5 వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూలు ఖరారు చేశారు. మిగిలిన సీట్లను కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం నవంబరు 4న మార్గదర్శకాలు ప్రకటించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. అమానుషం..

మైనర్‌ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించిందని పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరంలోని పార్శిబండలో ఓ ఇంట్లో పనిచేస్తున్న బాలికను యజమాని కుమారుడు ప్రలోభపెట్టి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అందుకు బాలిక ప్రతిఘటించడంతో విషయం బయటపడుతుందని పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో బాలికకు తీవ్రగాయాలు అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వివాదాల తర్వాత..

బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సమావేశం నవంబరు17న జరగనున్నట్లు రష్యా ప్రకటించింది. సరిహద్దులో తీవ్ర వివాదాలు చోటు చేసుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​లు మొదటిసారి ఈ సదస్సులో ఎదురుపడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ భేటీకి రష్యా నేతృత్వం వహిస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. చంద్రుడిపైనే..

చంద్రుడి కక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్న జపాన్​ స్పేస్​ ఏజెన్సీ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ ఇంధన కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది. చందమామపై అన్వేషణ నిమిత్తం చేసే అంతరిక్ష యాత్రకు ఇంధనాన్ని భూమి నుంచి తీసుకెళ్లాల్సి వస్తోందని, దీని వల్ల ఖర్చు పెరుగుతోందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ముంబయిని ఆపేనా..?

ముంబయి ఇండియన్స్​-రాజస్థాన్​ రాయల్స్​ జట్ల మధ్య అబుదాబి​ వేదికగా నేడు(మంగళవారం) మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. విజయంపై ఇరుజట్లు ధీమాగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.బాలయ్య వేట

కరోనా వల్ల నిలిచిపోయిన బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబో సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో పునఃప్రారంభం కానుంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాల కోసం లొకేషన్ల వేట సాగిస్తోంది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.