ETV Bharat / city

టాప్​ టెన్​ ​న్యూస్​@9am - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news@9am
టాప్​టెన్​ ​న్యూస్​@9am
author img

By

Published : Aug 12, 2020, 8:58 AM IST

1.టెండర్లకు సిద్ధం..

నూతన సచివాలయ భవన నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియకు రహదార్లు, భవనాల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రూ.400 కోట్లతో అనుమతులు మంజూరు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. జెండా వందనం..

కొవిడ్​ నేపథ్యంలో ఆగస్టు 15 వేడుకలపై నీలినీడలు అలుముకున్న తరుణంలో సర్కారు స్పష్టతనిచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. స్పష్టత వచ్చింది..!

వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడిందని ఏఐజీఈ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుందంటున్న నాగేశ్వరరెడ్డితో 'ఈనాడు- ఈటీవీ భారత్​’ ముఖాముఖి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. నిపుణుల భేటీ

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ నేడు సమావేశం కానుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సేకరణ, రవాణా సహా ఇతర అంశాలపై నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలోని ఈ కమిటీ చర్చించనుంది. సమావేశంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు పాల్గొననున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. గ్రీన్ సిగ్నల్

8,722 కోట్ల విలువైన కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వైమానిక దళానికి 106 ప్రాథమిక శిక్షణ విమానాలను సమాకూర్చడం వంటివి వీటిలో ఉన్నాయి.హెచ్‌టీటీ-40గా పిలిచే శిక్షణ విమానాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. మేం సిద్ధం

తూర్పు లద్దాఖ్​ వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీకి తెలిపారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్ రావత్. కఠినమైన శీతాకాలంలోనూ దీర్ఘకాలం పాటు పోరాటం కొనసాగించే విధంగా సాయుధ దళాలు సన్నద్ధమైనట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. వైరస్​కు చెక్​..!

వస్తువులు, ఉపరితలాలు, పరిసరాలు, ఏరోసోల్స్‌లను క్రిమిరహితం చేసేందుకు మాసర్‌ టెక్నాలజీ ఓ పరికరాన్ని తయారు చేసింది. దీన్ని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ విపణిలోకి ప్రవేశపెట్టారు. కరోనా వైరస్‌తోపాటు, ఇతర వైరస్‌లనూ ఇది సమర్థంగా నిర్మూలిస్తుందని సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. డ్రాగన్​కు కళ్లెం

ప్రపంచ వేదికపై సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న పరిణామాలు మరో ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. తొలి ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో భారత్‌ దాదాపు తటస్థంగానే ఉంది. అందుకే పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇప్పుడు అమెరికా-చైనా మధ్య ఆధిపత్య పోరుకు భారత్‌ వేదికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో- చైనాతో 'ఓ మంచి పొరుగు దేశంగా ఉండాల'నే భ్రమ నుంచి భారత్‌ త్వరగా బయటకు రావాలి. ఆయుధాలతో మాత్రమే కాదు- ఆర్థికంగానూ ఢీ అంటే ఢీ అనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలి! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. అప్పుడేం అర్థం కాలేదు

ఒలింపిక్స్​లో స్వర్ణం గెలిచిన తర్వాత తనకు ఏం చేయాలో పాలుపోలేదని చెప్పాడు భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా. కానీ తర్వాత మనసు మార్చుకుని ఆటలో కొనసాగానని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. 'జెర్సీ'నే ఎక్కువ..

'జెర్సీ' సినిమాతో తన అనుభవాలు పంచుకున్న హీరో నాని.. తన సినిమాల్లో ఎక్కువసార్లు చూసిన చిత్రమిదేనని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.