1. తెలంగాణ లెక్క..
తెలంగాణ రాష్ట్ర జనాభా 2018 మధ్య నాటికి 3,72,10,000కి చేరింది. కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా ‘2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ గణాంకాలను విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
2. తల్లిపాలతో రాదు
తల్లికి కరోనా ఉన్నప్పటికీ.. బిడ్డకు పాలు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. తల్లిపాల ద్వారా కరోనా సోకదని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్నే చెప్పిందని గుర్తు చేస్తున్నారు. అయితే పాలు ఇచ్చేటప్పుడు మాస్కులు, గ్లౌజులు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
3. గ్రేటర్లో మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ కరోనా పంజా విసురుతోంది. తాజాగా 463 మందికి కరోనా సోకింది. వీటితో కలిపి నగరంలో ఇప్పటి వరకు మొత్తం 42,652 కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
4. సొంతూళ్లో వ్యవసాయం
పల్లె తల్లివంటిది... పట్నం ప్రియురాల్లాంటిదంటారు! కరోనా పుణ్యమా అని అది అనుభవంలోకి వచ్చింది చాలామందికి! కాసుల వేటో... కెరీర్ పాటో పాడుకుంటూ... తనను వదిలివెళ్ళిన చాలామందికి కరోనా కాలంలో మళ్ళీ ఆ పల్లెనే తల్లిలా ఆదరిస్తోంది. ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది. తనకలవాటైన రీతిలో ఉన్నదాంట్లోనే కలోగంజి అంటూ.. ఆకలి తీరుస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
5.. దేశానికి రక్ష
దేశానికి కావాల్సిన సైనిక సామగ్రిని భవిష్యత్తులో సొంతంగానే రూపొందించుకోవాలని తొలి ప్రధాని పండిత నెహ్రూ దిశానిర్దేశం చేశారు. తాత్కాలికమంటే అర్థంకాని, సొంతంగా రూపొందించుకోవాలనడంలోని పరమార్థంగాని తెలియని పాలకుల హ్రస్వదృష్టి కారణంగా రక్షణ రంగంలో పరాధీనత దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సాంకేతికత దేశీయ పరిశ్రమలకు ఊతమయ్యేలా శ్రద్ధవహిస్తేనే- రక్షణ రంగంలో స్వావలంబన సాకారమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
6. మహోపద్రవం
ఇష్టానుసారంగా నీటిని వాడేస్తున్నాం. 'మన ఇంట్లో మన కుళాయిలో నీళ్లు దండిగా వస్తున్నాయి మనకు నీటి సమస్యేలా 'అని అతి నమ్మకం వీడాలి. ప్రపంచంలో దాదాపు 220 కోట్లమందికి తాగడానికి నీరు దొరకట్లేదని గ్రహించాలి. మేలుకోకుంటే మహోపద్రవం సంభవిస్తుందని తెలుసుకోవాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
7. బదిలీ తగ్గొచ్చు
కొవిడ్ వల్ల విదేశాల్లో ఉపాధి/రాబడి తగ్గడంతో, ఈసారి ఆసియా పసిఫిక్ దేశాలకు నగదు బదిలీ తగ్గొచ్చని ఏషియన్ డెవలప్‌మెంట్‌బ్యాంక్ అంచనా వేసింది. ఇందువల్ల పలు కుటుంబాలు పేదరికంలోకి జారిపోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
8. పార్టీలో కాల్పులు
వాషింగ్టన్లో జరిగిన భారీ బహిరంగ పార్టీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన ఓ అధికారి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
9. అయినా ఆడాడు..
పాకిస్థాన్‌తో తొలి టెస్టులో తీవ్ర ఒత్తిడిలోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్. ఆసుపత్రిలో తండ్రి ఓవైపు, జట్టులో చోటు పోతుందేమోనన్న భయం మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో కీలక అర్ధశతకం చేశాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
10. వేరే దారి చెప్పండి
కరోనా ప్రభావంతో 65 ఏళ్లు దాటినవారు సినిమా షూటింగ్స్‌లో పాల్గొనరాదు అనే అంశంపై మాట్లాడిన అమితాబ్.. తనకు వేరే ఉపాధి ఉంటే చెప్పమని అన్నారు. దాదాపు మూడు వారాల పాటు కరోనాతో పోరాడిన ఈయన.. ఇటీవలే కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.