1. గేటెడ్‌లో చికిత్స
కరోనా కేసులు పెరుగుతుండటంతో గేటెడ్ కమ్యూనిటీల్లో ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అనుమానిత లక్షణాలు, లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన, స్వల్ప లక్షణాలున్న, ముందస్తు లక్షణాలు కలిగిన వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. కరోనా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. వీటిని నివాస సంక్షేమ సంఘాలు సొంతగా లేదా ఎన్జీవోల సహకారంతో ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పలు సూచనలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తగ్గిన డిమాండ్
దేశంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ముంబయి, అహ్మదాబాద్, దిల్లీలో ఇళ్లకు గిరాకీ పడిపోయినట్లు, అత్యధికంగా హైదరాబాద్‌లో డిమాండ్ తగ్గినట్లు వివరించింది ప్రముఖ స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ 'ప్రాప్ టైగర్'. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కరోనాతో ఆదాయం
కారణమేదైనా ఆర్టీసీని నష్టాలు మాత్రం వీడటం లేదు. కరోనా కారణంగా బస్సు ఆక్యుపెన్సీ పడిపోయి.. నష్టాలు రెట్టింపయ్యాయి. ప్రతి నెలా కోట్లలో నష్టం వస్తోంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని బస్సులు నడుపుతున్నా.. ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఖాళీగా ఉన్న సీట్లను పార్శిల్స్ ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ. నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ నష్టాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నేడే సమావేశం
కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యల్లో భాగంగా నేడు బ్యాంకులు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) అధినేతలతో సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భారీ కుట్ర!
అయోధ్యలో రామ మందిరానికి ఆగస్టు 5న భూమిపూజ చేయనున్నారు. అదే రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉగ్రదాడులకు పాక్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మళ్లీ నెమ్మదే..
భారత ఆర్థిక వ్యవస్థ లాక్డౌన్ సడలింపుల తరువాత పుంజుకోవడం ప్రారంభించినా... అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆ ఒరవడి నెమ్మదిస్తుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మేలుకోకుంటే కష్టమే
ప్రభుత్వాల దుర్నిర్వహణ విధానాల ఫలితంగా కొన్ని రాష్ట్రాలు కరోనా మునుపే దివాలా అంచున నిలిచి ఉన్నాయన్నది వాస్తవం. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వాలు.. కరోనా పేరుతో ప్రజల భవిష్యత్తును పణంగాపెట్టి యథేచ్ఛగా ధనవితరణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు, భవిష్యత్‌లో వాటి ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. పులులు మాయం
దేశంలో మూడు పులుల సంరక్షణ కేంద్రాల్లో... పులులు అదృశ్యమైపోయాయి. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో కేంద్రం పేర్కొంది. మచ్చుకైనా ఒక్క పులి కూడా లేకుండాపోయిందని తెలిపింది. అత్యధికంగా కార్బెట్ రిజర్వులో 231 వ్యాఘ్రాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఆ మూడు ప్రాంతాల్లో పులులు మాయం కావడానికి కారణమేంటి? నివేదిక ఏం చెబుతోంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. లెక్కేసి మరీ కొడతాడు
క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడు ప్రదర్శన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సమయంలో బౌలర్లను ఏ విధంగా విశ్లేషిస్తాడో వెల్లడించాడు ఈ పరుగుల వీరుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఎంట్రీ సులభమే.. కానీ
బాలీవుడ్‌ను ప్రస్తుతం షేక్ చేస్తున్న పదం 'నెపోటిజమ్'. సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన ఔట్సైడర్స్కు.. ఇన్సైడర్స్, వారి కుటుంబాలు అవకాశాలు రాకుండా చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే దీనిపై స్పందించింది నటి శ్రుతిహాసన్. తండ్రి కమల్ పెద్ద స్టార్ హీరో అయినా.. తనదైన నటన, అందంతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుందీ భామ. నటిగానే కాకుండా గాయనిగానూ తన టాలెంట్ నిరూపించుకుంది. ఆ అమ్మడు ఏమని చెప్పిందో ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.