1. కన్నీటి నివాళి..
చెన్నైలో ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఎడతెరపి లేని వర్షాలు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 18.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. జోగులాంబలో పెద్దగంట
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 613 కిలోల భారీ గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామేశ్వరం నుంచి అయోధ్యకు తీసుకెళుతున్న ఈ గంటను.. తమిళనాడుకు చెందిన ఓ మహిళ తయారు చేయించింది. మోదీ జన్మదినం సందర్భంగా రామ రథయాత్ర పేరుతో ఈ గంటను రామేశ్వరం తీసుకెళ్తున్నట్లు ఆమె వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నేడు మోదీ ప్రసంగం
ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక ప్రసంగం చేయనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అంశాలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయనున్నారు. కరోనా, ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై మోదీ మాట్లాడే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అడుగు పడని అనుసంధానం
నదీజలాల సద్వినియోగం ద్వారా దురవస్థలకు అడ్డుకట్ట వేసి సుస్థిర మానవాభివృద్ధిని సాధించేందుకు నదుల అనుసంధానమే అత్యుత్తమ పరిష్కారం. ఎన్నో అధ్యయనాలు, మరెన్నో నివేదికలు దశాబ్దాలుగా ఘోషిస్తున్నదీ ఇదే. ఈ వాస్తవాన్ని అవగతం చేసుకున్న మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఈ బృహత్పథకం సాకారం కావడం తన ప్రగాఢవాంఛ అని ప్రకటించారు. పదిహేనేళ్లు గడచిపోయినా ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దిల్లీ టూ మీరఠ్..
దిల్లీ-మేరఠ్‌ల మధ్య ఆధునిక రైలును నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌లో తొలిసారిగా రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కింద దీన్ని ప్రవేశపెట్టనున్నారు. గుజరాత్‌లోని బంబార్డియర్ రైల్ ప్లాంట్‌లో తయారు చేస్తున్న ఈ రైలు నమూనాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా శుక్రవారం విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. విమాన ప్రమాదం
ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. చుహుయివ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో.. ఏఎన్-26 విమానం కూలి 22 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ మిలటరీ విమానం ఏవియేషన్ స్కూల్ విద్యార్థులను తీసుకువస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. వీసాలకు గడువు
విదేశీ వీసాలపై నిర్దిష్ట కాలపరిమితిని విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఏ దేశ వీసాలపై ఈ ఆంక్షలు విధిస్తుందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. చైనీయుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కోహ్లీ సేన తప్పే..
ఐపీఎల్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు భారీ తేడాతో ఓడిపోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ సందర్భంగా చివరి ఓవర్ దూబెతో వేయించడం విరాట్ కోహ్లీ చేసిన తప్పిదం అని వ్యాఖ్యానించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మరో నాలుగు పేర్లు
మాదక ద్రవ్యాల కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు హాజరైన కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ‘డ్రగ్ చాట్స్’ చేసినట్లు ఒప్పుకున్నారట. దాదాపు శుక్రవారం ఈ విషయంలో నాలుగు గంటల పాటు రకుల్‌ను విచారించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.