ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7pm - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7pm
టాప్​టెన్ న్యూస్ @7pm
author img

By

Published : Aug 27, 2020, 7:01 PM IST

1. పాతికేళ్ల అనుబంధం..

దక్షిణ భారత టెలివిజన్‌ రంగంలో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టిన... మీటీవీ ఈటీవీ.. ఇరవై ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తెలుగు టెలివిజన్‌ రంగంలో రెండున్నర దశాబ్దాల పాటు ప్రేక్షక నీరాజనాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈటీవీ రజతోత్సవం జరుపుకుంది. ఆబాల గోపాలన్ని అలరించే కార్యక్రమాలు, విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తలకు చిరునామాగా నిలిచి.. 25వ పుట్టినరోజును జరుపుకున్న ఈటీవీ.. మరెన్నో ఆనందాలు, సంతోషాలకు స్వాగతం పలుకుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. మీరే ఆదుకోవాలి..

రాష్ట్రంలో చేపడుతున్న పారిశ్రామిక పార్కులకు కేంద్ర సాయం కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ కోరారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో నిర్వహించిన 'వన్ డిస్ట్రిక్ - వన్ ప్రొడక్ట్' కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. రాగల మూడ్రోజులు

నైరుతి ఝార్ఖండ్​ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నందున తెలంగాణలో శుక్రవారం.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. దేశీయంగానే తయారీ..

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. గతంలో ఉన్న అవకాశాలు వినియోగించుకోవటంలో భారత్​ విఫలమైందన్నారు. దేశంలో రక్షణ పరికరాల తయారీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన ఆయన.. ఈ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. సమావేశాల సన్నాహాలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లపై లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా సమీక్ష నిర్వహించారు. భౌతిక దూరం పాటించేందుకు అనుసరించిన వ్యూహాలపై అధికారులతో చర్చించారు. పార్లమెంట్‌ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. వ్యాక్సిన్ ఓకే..

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌ను పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుప్రతిలో పనిచేసే ఇద్దరు వలంటీర్లకు మొదటి డోసు వేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం, శరీర పనితీరు బాగానే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. నెలరోజుల తర్వాత వారికి మరో డోసు ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కరోనా విజేతలు

భారత్​లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 25 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ మరణాల రేటు స్థిరంగా క్షీణిస్తుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ర్యాపిడ్ టెస్టుకు ఓకే..

తొలి ర్యాపిడ్ టెస్ట్​కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థ ఆమోదం తెలిపింది. 15 నిమిషాల్లో ఫలితం తెలుసుకునేలా అబాట్ లేబరేటరీస్ తయారు చేసిన ఈ పరీక్ష విధానానికి అనుమతులు ఇచ్చింది. అయితే ఇందులో నెగెటివ్ వస్తే ల్యాబ్​ల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు కొవిడ్‌ టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను సీడీసీ సవరించింది. ఈ నిర్ణయంతో నిపుణుల్లో ఆందోళన మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. షెట్లర్​కు కరోనా

అర్జున పురస్కారానికి ఎంపికైన యువ షట్లర్ సాత్విక్ సాయిరాజ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. తనకు లక్షణాలు ఏం లేవని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. నాన్నాకు ఫిజియోథెరఫీ చేశారు..

తన తండ్రి ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎస్పీ చరణ్ చెప్పారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన కరోనా బాధపడుతూ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.