1. వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం 18 రోజులు సభ నిర్వహించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అవును.. ఆపేశాం
గత ఆర్థిక సంవత్సరం నుంచే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపేసినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్బీఐ. దీనితో 2018 మార్చి నాటికి 33,632 లక్షలున్న రూ.2 వేల నోట్ల సంఖ్య.. 2020 మార్చి ముగిసే సమయానికి 27,398 లక్షల సంఖ్యకు తగ్గినట్లు వెెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆ స్థాయిలో ఉండాలి..!
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్ల తరహాలోనే హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విండ్ ప్లోపై అధ్యయనం చేశామని, ఆ మేరకే మాస్టర్ ప్లానింగ్ ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మౌనమే సమాధానం
కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో మొదటి రోజు అనిశా విచారణ ముగిసింది. నాగరాజు ఇంట్లో దొరికిన డబ్బు, విలువైన భూ పత్రాలపై అధికారులు ప్రశ్నించారు. పలు ప్రశ్నలకు తహసీల్దార్ నాగరాజు, ఇతర నిందితులు సమాధానం ఇవ్వలేదు. రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తీర్పు వాయిదా
సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష విధించే అంశంలో ధర్మాసనం వాదనలు పూర్తిచేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇదివరకే దోషిగా నిర్ణయించిన న్యాయస్థానం.. తాజాగా శిక్షకు సంబంధించి తీర్పును రిజర్వు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. వాయిదాకే మద్దతు
జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో భారత్‌లో జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. సంస్కరణలతోనే సాధ్యం
కరోనా నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలన్నా, సుస్థిర వృద్ధి సాధించాలన్నా భారీ ఎత్తున సంస్కరణలు తప్పనిసరి అని మరోసారి స్పష్టం చేసింది ఆర్బీఐ. కొవిడ్ భయాలు తొలిగే వరకు ఆర్థిక వృద్ధి మందగమనంగానే ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. కోహ్లీ.. ఆసియాలోనే నెం.1
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య ఇస్టాగ్రామ్‌లో 75 మిలియన్లకు చేరింది. దీంతో ఆసియాలోనే ఈ ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా నిలిచాడు విరాట్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. జస్టిస్ ఫర్ ఎస్ఎస్ఆర్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. సుశాంత్ మృతికి న్యాయం జరగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రంగోలీ ప్రార్థనలు
ఎస్పీ బాలు కోలుకోవాలని కర్ణాటకకు చెందిన ఓ రంగోలి కళాకారుడు వినూత్నంగా ప్రార్థించారు. రంగోలీతో బాలు చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.