ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5PM
టాప్​టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Jan 23, 2021, 5:00 PM IST

1. గ్రామగ్రామాన 'నాబార్డ్'

సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన నాబార్డు ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. 795 పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్‌రావుతో పాటు ఇతర అధికారులను సీఎస్ అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నేతాజీని ఆదర్శంగా తీసుకోవాలి

నేతాజీ సుభాశ్​ చంద్రబోస్​ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని సూచించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన జీవితం నుంచి ప్రేరణ పొంది నవ భారత నిర్మాణానికి కృషిచేయాలని యువతను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'దేశ్​ నాయక్​ దివస్​'

నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఏనాడు జరపలేదని బంగాల్​ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శించారు. పరాక్రమ్​ దివస్​ పేరుతో బోస్ జయంతి​ వేడుకలను కేంద్రం ఇప్పుడు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. హల్వా వేడుక

బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతీ ఏటా నిర్వహించే హల్వా వేడుక శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ లో జరిగింది. ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్​, సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​, శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఎయిమ్స్​కు లాలూ

బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయనను దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు డాక్టర్​ ఉమేశ్ ప్రసాద్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. రామాలయ ప్రణాళిక

అయోధ్యలోని రామాలయ ప్రాంగణ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ వెల్లడించింది. ఆలయ ప్రాంగణాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దుతామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. చైనా బంపర్​ ఆఫర్​..

చైనా తమ దేశ సైనికుల జీతభత్యాలను భారీగా పెంచునున్నట్లు తెలుస్తోంది. మరింత ఆధునిక, చురుకైన పోరాట శక్తిగా సైన్యాన్ని తీర్చిదిద్దేందుకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్​కు చెందిన సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్​ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కమలలకు ఆఫర్​

కమలా హారిస్​... అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ మూలాలు ఉన్న మహిళ కావడంతో ఆమె అందుకున్న విజయాన్ని కమల అనే పేరు ఉన్న వారందరికి పంచాలి అనుకుంది ఓ థీమ్ పార్క్​. ఈ పేరుతో ఉన్న వారందరికీ ఈ నెల 24 సరదాగా గడిపే అవకాశం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. మహీంద్ర బహుమతులు

ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్రపోషించిన శార్దూల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్‌, నవ్‌దీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్, నటరాజన్‌లను ప్రశంసించారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర. వారికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అక్టోబర్ 8న ఆర్ఆర్ఆర్..?

'ఆర్ఆర్ఆర్' రిలీజ్​ తేదీ అంటూ ఇన్​స్టాలో పొరపాటున పోస్ట్ చేసిన నటి అలీసన్ డూడీ.. వెంటనే దానిని తొలగించింది. అయితే ఆ తేదీనే సినిమా వస్తుందేమోనని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.