ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @5 PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తుల

topten news @5pm
టాప్‌టెన్‌ న్యూస్ @5 PM
author img

By

Published : Oct 3, 2020, 5:00 PM IST

1. హాథ్రస్‌కు రాహుల్

దిల్లీ-నోయిడా వంతెన వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్​ గాంధీని హాథ్రస్​ పర్యటనకు అనుమతినిచ్చినప్పటికీ.. కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. బోగస్ ఓట్లకు యత్నం

జీహెచ్ఎంసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. అఖిలపక్ష భేటీకి జిల్లా ఎన్నికల అధికారి రాకపోవడం సరికాదని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్చకుండా ఆర్డినెన్స్ తెచ్చే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి రిజర్వేషన్లు సరిచేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మోదీ మరో నిర్ణయం

హిమాచల్​ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. మనాలీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజల కోసం హమీర్​పుర్​లో 66 మెగా వాట్ల ధౌలసిద్ధ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల దేశానికి విద్యుత్ సరఫరాతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. గల్వాన్ వీరులకు స్మారకం

గల్వాన్​లో చైనా సైన్యంతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన సైనికులకు గుర్తుగా యుద్ధ స్మారకం నిర్మించారు. దౌలత్ బేగ్ ఓల్డీ రహదారికి సమీపంలో ఉన్న కేఎం-120 స్థావరం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిహార్ బరిలో మజ్లిస్

బిహార్​ ఎన్నికల పర్వాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పొత్తులు-పైఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. బిహార్​ బరిలో నిలిచిన అసదుద్దీన్​ ఓవైసీ పార్టీ ఎంఐఎం... తన బద్ధవిరోధ కూటమి ఎన్డీఏ నెత్తిన పాలు పోసే అవకాశాలు ఉన్నాయంటున్నారు బిహార్ ఈటీవీ భారత్ బ్యూరో చీఫ్​ అమిత్​ భెలారీ. ప్రతిపక్ష ఆర్జేడీ ముస్లిం ఓట్లను.. ఎంఐఎం చీల్చటం భాజపా మిత్రపక్షాలకు కలిసొస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. దీదీ మద్దతు

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బంగాల్​లోని కోల్​కతాలో నిరసన ర్యాలీ చేపట్టింది తృణమూల్​ కాంగ్రెస్​. ఈ ప్రదర్శనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. సెటిల్ చేశాం కదా..!

హాథ్రస్ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు.. రాజ్​వీర్ సింగ్ దిలేర్(భాజపా). సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న ఆ ఆడియో విన్నవారంతా ఇప్పుడు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇంతకీ, ఆ ఆడియో రికార్డులో ఏముంది..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. నవాజ్‌ను రప్పించండి

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను బ్రిటన్ నుంచి తిరిగి తీసుకురావడానికి చట్టపరమైన వ్యూహాన్ని సిద్ధం చేయాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. మాసాంతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ షురూ..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్​ఆర్ఆర్' షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందట. ఈనెల చివరి వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి మొదలుపెట్టనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

స్టార్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్.. ఐపీఎల్​లో ఆడేందుకు యూఏఈకి వస్తున్నాడు. ఆరురోజుల క్వారంటైన్​ తర్వాత జట్టుతో కలవనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.