ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@3pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 25, 2020, 3:00 PM IST

topten news @3pm
టాప్​టెన్ న్యూస్@3pm

1. రాష్ట్రంలో కరోనా..

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2 వేల 579 కేసులు నమోదయినట్లు వైద్యరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మెుత్తం కేసుల సంఖ్య లక్ష 8వేల 670కి చేరింది. వైరస్‌ బారిన పడి మరో 9 మంది మృతి చెందినట్లు తెలిపింది. కొవిడ్‌ నుంచి కోలుకుని 1752 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. హ్యూమన్ కాలిక్యులేటర్

ఇటీవల లండన్​లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో పాల్గొని మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు హైదరాబాద్​కు చెందిన 20 ఏళ్ల నీరకంఠ భానుప్రకాశ్. అంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమన్​ కాలిక్యులేటర్ అన్నమాట! మరి తన గురుంచి తెలుసుకుందామా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. వేలం పాట..

రూ.20 వేల కోట్లు విలువైన‌ ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను కొనుగోలుతోపాటు అదేస‌మ‌యంలో విక్ర‌యించ‌నున్న‌ట్లు ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది. ఆగస్టు 27, సెప్టెంబర్ 3 తేదీల్లో రెండు దఫాల్లో ఈ వేలం నిర్వహించనుంది ఆర్​బీఐ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. భారత్ ఘనత

భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ అరుదైన ఘనత సాధించింది. భూమికి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి అతినీలలోహిత కాంతిని కనుగొన్నట్లు ఐయూ సీఏఏ తెలిపింది. ఐదు ప్రత్యేకమైన ఎక్స్‌రే, అతినీలలోహిత టెలిస్కోప్‌లను కలిగి ఉన్న భారత మొట్టమొదటి బహుళ తరంగ దైర్ఘ్య ఉపగ్రహం ఆస్ట్రోసాట్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. 'ఆక్స్​ఫర్డ్' రెండోదశ

కొవిడ్​-19 టీకాపై ఆశలు రేపుతున్న ఆక్స్​ఫర్డ్​ యూనివర్సటీ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ రెండో దశ క్లినికల్​ ట్రయల్స్.. మంగళవారం భారత్​లో ప్రారంభం కానున్నాయి. పుణెలోని భారతి విద్యాపీఠ్​ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఈ ప్రయోగాలను నిర్వహించనుంది సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ప్రపంచంలో కరోనా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 38 లక్షల 9 వేలు దాటింది. ఇప్పటివరకు 8 లక్షల 17 వేల మందికిపైగా మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య 59 లక్షలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ట్రంప్ X టిక్​టాక్

తమ వ్యాపారాలపై అమెరికాలో నిషేధం విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ టిక్​టాక్​ కోర్టుకెక్కింది. రాజకీయ ఉద్దేశాలతో తమపై నిషేధం విధించాలని చూస్తున్నారనే ఆరోపణలతో.. కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ట్రంప్ సహా, కామర్స్ సెక్రటరీ, వాణిజ్య శాఖలను ప్రతివాదులుగా పేర్కొంది టిక్​టాక్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. కొత్త కోచ్

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు నూతన బౌలింగ్​ కోచ్​ను నియమించింది ఆ జట్టు యాజమాన్యం. ఆస్ట్రేలియా మాజీ పేసర్ రియాన్​​​ హ్యారిస్​​ను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేసింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది బృందంతో కలవడని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. డోపింగ్ పరీక్షలు

ఐపీఎల్​ ప్లేయర్లకు డోపింగ్​ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమౌతోంది నాడా. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్​ 10 మధ్య మూడు విడతల్లో పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం ఆతిథ్య దేశంలో ప్రత్యేకంగా 5 డోపింగ్​ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. అధ్యయన బృందం

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ శవపరీక్ష నివేదికను అధ్యయనం చేయడానికి ఐదుగురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఆల్​ఇండియా ఇనిస్టిట్యూట్​ ఫర్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​). హీరో మృతికి సంబంధించిన పోస్టుమార్టమ్ నివేదికతో పాటు మరణానికి కారణమైన అంశాలను ఈ బృందం అధ్యయనం చేస్తుందని ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ విభాగాధిపతి సుధీర్​ గుప్తా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.