ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్ @1pm - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1pm
టాప్​టెన్​ న్యూస్ @1pm
author img

By

Published : Dec 27, 2020, 12:57 PM IST

1. సరికొత్తగా..

కొత్త సంవత్సరంలో దేశం సమున్నత శిఖరాలను అధిరోహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితులు అనేక పాఠాలు నేర్పించాయన్నారు. ఆర్థిక వేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. అయితే ఈ కాలంలో భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంచుకుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఉద్రిక్తత..

నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పునరావాస పరిహారం ఇచ్చేవరకు పనులు చేపట్టవద్దని లక్ష్మణాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్‌ సీసాలతో నిరసన తెలిపారు. ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు గ్రామస్థులు యత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. గుల్లక్ బ్యాంకు

పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు.. అలవాటు చేయాలనే లక్ష్యంతో బిహార్​లో ఏర్పాటు చేసిన బాలల బ్యాంక్.. గుల్లక్​. దీన్ని 2009లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఇందులో ఖాతాదారులుగానే కాకుండా బ్యాంకు నిర్వహణ బాధ్యత కూడా చిన్నారులే చేపట్టడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అసోంలో షా..

అసోం పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. ఆదివారం గువాహటిలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర సీఎం, ఆరోగ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఐహెచ్​సీ వాయిదా..

కరోనా మహమ్మారి వల్ల ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 81వ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కీలక సమస్యలు, అంశాలపై ఆన్​లైన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐహెచ్​సీ తెలిపింది. పంజాబ్ రైతుల నిరసనలు, భారతీయ నాగరితక వంటి విషయాలపై డిసెంబర్ 28 నుంచి 30 మధ్య వెబినార్లు జరగనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఇదే చివరిది కాదు..

భవిష్యత్తులో కరోనా వైరస్ లాంటి మహమ్మారులను ఎదుర్కోవాల్సి రావొచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. 'అంటువ్యాధుల సన్నద్ధత' అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు. అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి లోపిస్తే ప్రమాదాలు తప్పవని అన్నారు. భవిష్యత్తు మహమ్మారులను నివారించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఇవి పాటిద్దాం..

కరోనా వల్ల ఈ ఏడాది చాలా మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఇలాంటి సంక్షోభం ఇదే చివరిది కాదు.. మళ్లీ ఎప్పుడైనా ఇలాంటి గడ్డుకాలం రావచ్చు. మరి అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఇకపై ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త సంవత్సరం నుంచే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరురచుకునే ప్రణాళికను ప్రారంభిచడం మేలు. మరి ఆ ప్రణాళిక ఎలా ఉండాలి అనేదానిపై నిపుణుల సలహాలు మీ కోసం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. వార్నర్ డౌటే!

టీమ్​ఇండియాతో మూడో టెస్టులో వార్నర్ ఆడేది సందేహంగా కనిపిస్తోంది.​ ఈ విషయమై ఆసీస్​ కోచ్ లాంగర్ స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు. సిడ్నీ వేదికగా ఆ మ్యాచ్​ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బుట్టబొమ్మే టాప్

మరికొన్ని రోజుల్లో 2020 కాల గర్భంలో కలిసిపోనుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా వెతికిన పాటలు, సినిమాలు, వార్తల గురించే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సునీత ప్రీ వెడ్డింగ్..

వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్న ప్రముఖ గాయని సునీత-వ్యాపారవేత్త రామ్​.. శనివారం(డిసెంబరు 26) ప్రీ వెడ్డింగ్​ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రేణూదేశాయ్‌, సుమ, పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.