ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్ @1PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1PM
టాప్​టెన్​ న్యూస్ @1PM
author img

By

Published : Dec 16, 2020, 12:55 PM IST

1. మెట్రోకు రద్దీ

హైదరాబాద్ మెట్రోరైలులో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్ సడలింపుల ప్రారంభంలో ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ... గత కొద్దిరోజులుగా జంట నగరాల్లో మెట్రోను ఆశ్రయిస్తున్నావారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు లక్ష 70 వేలకు పైగా ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మెట్రోలో ఉదయం పూట సమయాన్ని పెంచడం.... అన్ని స్టేషన్లు తెరచుకోవడంతో రద్దీ పెరుగుతోంది. కరోనా తగ్గుముఖం పట్టడమూ ప్రయాణికుల్లో భరోసా నింపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ముగిసిన పంచాయతీ

నల్గొండ జిల్లా నకిరేకల్.. కొత్త పురపాలికగా అవతరించింది. ప్రస్తుత మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసి.. పురపాలన అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో కొత్త పురపాలికల ఏర్పాటులో భాగంగా 2018 మార్చిలోనే ఉత్తర్వులు వెలువడినా.. నకిరేకల్​లో రెండేళ్ల తర్వాత అమల్లోకి వచ్చినట్లయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. స్వర్ణతాపడం..

తిరుమల మహాద్వారానికి బంగారు తాపడం చేయించాలని తితిదే నిర్ణయించింది. ధ్వజస్తంభ పీఠం, బలిపీఠాలకు మరమ్మతులు జరిపించాలని యోచిస్తున్నారు. దీని కోసం 6.6 కిలోల బంగారాన్ని వినియోగించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. స్వర్ణ విజయ జ్యోతి

భారత్-పాకిస్థాన్​ మధ్య జరిగిన యుద్ధానికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ.. వీర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అంజలి ఘటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. లైఫ్​టైమ్ రికార్డ్

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సూచీలు ఇవాళ్టి ట్రేడింగ్​లో జీవితస్థాయి గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్​ 300 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 46 వేల 556 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. రైతు నిరసనలు..

రైతుల నిరసనపై దాఖలైన పలు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఆందోళనల వల్ల సామాన్యుల రాకపోకలు, అత్యవసర సేవలు నిలిచిపోతున్నాయని, వెంటనే రైతులను సరిహద్దుల నుంచి ఖాళీ చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్ సంభల్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, గ్యాస్​ ట్యాంకర్​ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఎట్టకేలకు దర్శనం

కరోనా కారణంగా నేపాల్​లో మూతపడిన ప్రసిద్ధ పశుపతినాథ్​ ఆలయాన్ని ఎట్టకేలకు తెరిచారు. అయితే కొవిడ్​ మార్గదర్శకాల ప్రకారమే భక్తులు పూజలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఎక్కువ అవే చూస్తా..!

స్టార్ ఫుట్​బాలర్ అతడు.. కానీ ఆ గేమ్​లు దాదాపుగా చూడడు. టీవీల్లో మ్యాచ్​లు వస్తున్నా సరే వేరే గేమ్స్​ చూసేందుకు ఇష్టపడతాడు. ఇంతకీ ఆ ఫుట్​బాలర్ ఎవరు? ఏ క్రీడల్ని ఎక్కువగా చూస్తాడు? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మరో 'మెగా' పెళ్లి

వచ్చే ఏడాది మెగా పెళ్లి కబురు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరో సాయితేజ్​ వెల్లడించారు. తనకంటే అతడే పెద్దవాడని అన్నారు. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.