ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1PM
టాప్​టెన్ న్యూస్ @1PM
author img

By

Published : Dec 14, 2020, 1:02 PM IST

Updated : Dec 14, 2020, 1:52 PM IST

1. తప్పిన ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు భారీ ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద వాహనం అదుపుతప్పి కిందకు దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'టీకా పంపిణీ' శిక్షణ

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం సమాయత్తం చేస్తోంది. అందుకోసం రెండు రోజుల పాటు శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డబ్లూహెచ్​వో, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కథానాయకుడే..

కరోనా... బంధాలను బంధుత్వాలను దూరం చేస్తుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తులను బంధువులు చివరి చూపు కూడా చూడడం లేదు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకుండా ముఖం చాటేస్తున్నారు. కన్నవారే....కాటికి రాని ఈ రోజుల్లో గ్రామ సర్పంచ్​ అన్నీ తానై అంత్యక్రియలు జరిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రైతు పోరుబాట

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. దిల్లీ సరిహద్దుల్లో సోమవారం ఉదయం 8 గంటలకు నిరాహా దీక్ష చేపట్టారు రైతన్నలు. హస్తిన సహా.. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దీక్షలు జరుగుతాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భారీ అగ్ని ప్రమాదం

రాజస్థాన్​ అల్వార్ జిల్లా నీమ్రానాలోని కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్​ ఇంజిన్లలో రంగంలోకి దిగారు అగ్నిమాపక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మరింత తీవ్రం..!

ప్రపంచ దేశాలకు కంటిపై కునుకు లేకుండా కరోనా పట్ల రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​. వచ్చే 4-6 నెలల్లో వైరస్​ తీవ్రరూపం దాల్చే అవకాశమున్నట్టు పరిశోధనల్లో తేలిందని చెప్పారు. అయితే.. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం వల్ల మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు గేట్స్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బర్గర్ కింగ్ రికార్డ్

దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్​ అయిన తొలి రోజే ఫాస్ట్​ ఫుడ్ ప్యాపార సంస్థ బర్గర్​ కింగ్ షేరు రికార్డు స్థాయిలో పెరిగింది. షేర్ ఇష్యూ ధర (రూ.60)తో పోలిస్తే 120 శాతానికిపైగా పెరిగింది. ఒక షేరు ధర ప్రస్తుత రూ.134 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ధోనీ లేక విలవిల

ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు టీమ్​ఇండియా రచిస్తోన్న వ్యూహాలు విఫలమవుతున్నాయి. జట్టులో చాహల్​, కుల్​దీప్​ వంటి మెరుగైన బౌలర్లు కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. వీటన్నింటికీ కారణం జట్టులో ధోనీ లేకపోవడమేనా? అదే జట్టుకు బలహీనతగా మారిందా? వంటి అంశాల సమాహారమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'విరాట పర్వం'

దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'విరాట పర్వం'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రానా ఫస్ట్​ లుక్​,​ గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ట్విట్టర్ హీరోలు..!

ఈ ఏడాది ట్విట్టర్​లో ఎక్కువగా మాట్లాడుకున్న దక్షిణాది సినిమాలు, హీరోహీరోయిన్ల జాబితా విడుదలైంది. హీరోల్లో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, హీరోయిన్లలో కీర్తి సురేశ్, కాజల్ అగర్వాల్ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 14, 2020, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.