ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1pm - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1pm
టాప్​టెన్​ న్యూస్ @1pm
author img

By

Published : Nov 27, 2020, 12:59 PM IST

1. 'ఛలో దిల్లీ'లో ఉద్రిక్తత

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. దిల్లీ వైపు వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పౌరుల భవిష్యత్తే ముఖ్యం..

తెరాస ప్రభుత్వం హైదరాబాద్​ నగర పౌరుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంపుదలకు కృషి చేశామని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రాష్ట్రంలో కరోనా..

రాష్ట్రంలో కొత్తగా నమోదైన 761కేసులతో కలిపి... బాధితుల సంఖ్య 2,67,665కు చేరింది. మరో నలుగురు మృతి చెందగా... ఇప్పటి వరకు వైరస్ 1,448 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 10,839 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 150 పోలింగ్ కేంద్రాలు..

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి సాఫీగా, పారదర్శకంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది. వెబ్ కాస్టింగ్, సీసీకెమెరాల ఏర్పాటు సహా మైక్రో అబ్జర్వర్ల సేవలు వినియోగించుకోనున్నారు. ఓటరు గుర్తింపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. డివిజన్​కు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించేందుకు రంగం సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'దిశ'కు ఏడాది

దిశ హత్యాచార ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది. శంషాబాద్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే దిశను నలుగురు యువకులు అమానుషంగా అత్యాచారం చేసి... ఆ తర్వాత చటాన్​పల్లి వద్ద వంతెన కింద కాల్చేశారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ తర్వాత ఘటనా స్థలంలో నుంచి వివరాలు సేకరిస్తుండగా... పోలీసులపై ఎదురు తిరిగారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితులు చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రెండు ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక న్యాయ కమిషన్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. దేశంలో కరోనా..

దేశంలో కొత్తగా 43,082 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 93లక్షల 9వేల 788కి చేరింది. వైరస్​ కారణంగా మరో 492 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కొవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

గుజరాత్​లోని కరోనా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐసీయూలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సురక్షితమేనా..?

ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా టీకా భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వైరుధ్యం తలెత్తడం వల్ల నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సమర్థతను తేల్చేందుకు మరోసారి ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈవో పాస్కల్‌ సోరియట్‌ తెలిపారు. మరోవైపు ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను వినియోగానికి అనుమతించాలో లేదో క్షుణ్నంగా సమీక్షించాలని మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీని బ్రిటన్ ప్రభుత్వం కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. నాకొద్దూ..

కరోనాపై మొదటి నుంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ఇంకా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజలకు కూడా ఆ అవసరం ఉండబోదన్నారు. మాస్క్‌ ధరిస్తే వైరస్‌ వ్యాప్తిని అరికట్టొచ్చని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. థియేటర్ల మూత..

హైదరాబాద్‌లో సినిమా థియేటర్ల ముఖచిత్రం మారిపోనుంది. లక్షలాది మంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరగవుతున్నాయి. నిర్వహణ భారం, వరుస నష్టాలతో పాటు కరోనా దెబ్బకు దాదాపు 15 థియేటర్లు శాశ్వతంగా మూసివేయాలని యజమానులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.