1. కాల'నీళ్లు'
హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. పాతబస్తీ శివారులోని గుర్రం చెరువు కట్ట తెగింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఉప్పగూడ, సాయిబాబా నగర్, శివాజీనగర్, బాబా నగర్ బస్తీలను వరద ముంచెత్తింది. వర్షంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గుర్రాలపై సహాయక చర్యలు
చూడగానే ఇదేంటి వీళ్లు నీళ్లలో గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు అనుకుంటున్నారా! గుర్రాల రేసు కోర్టులో ఉండాల్సిన రైడర్లు కాలనీల్లో తిరుగుతున్నారేంటి అనుకుంటున్నారా! అవును ఇది నిజమే కానీ వారంతా స్వారీ చేయట్లేదు. హైదరాబాద్ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్నారు. టోలిచౌకిలోని వివిధ కాలనీల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో వినూత్న పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కబ్జా చేసినా పట్టించుకోవా..?
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ రంగానాయకుల గుట్టకాలనీలో నాలా భూమిలన్నీ కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పటించుకోలేదని కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిని నిలదీశారు. కాలనీ వరదలో మునిగిపోతుందంటూ కార్పొరేటర్‌పై దాడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అర్ధరాత్రి హత్య..
అర్ధరాత్రి రాధిక అనే యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కరోనా తగ్గుతోంది..!
భారత్‌లో కొవిడ్-19 పాజిటివ్ కేసుల రేటు తగ్గుతుంది. రోజువారీ పరీక్షల్లో పాజిటివ్ కేసులు 8 శాతానికి దిగువనే నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. విమర్శించినా.. అభిమానిస్తా
భాజపా నేతలు విమర్శించినప్పటికీ.. ప్రధాని మోదీని తాను అభిమానిస్తూనే ఉంటానని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ వెల్లడించారు. మోదీని తాను ఎందుకు గౌరవించకూడదని ప్రశ్నించారు. ఎల్జేపీ- భాజపా మధ్య విభేదాలున్నట్టు చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. గోల్డ్ డౌన్..
బంగారం దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 57 శాతం తగ్గాయి. దీనితో ఇదే కాలానికి దేశ వాణిజ్య లోటు కూడా (2019-20 మొదటి ఆరు నెలలతో పోలిస్తే) 88.92 బిలియన్ డాలర్ల నుంచి 23.44 బిలియన్ డాలర్లకు దిగొచ్చినట్లు వాణిజ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. వేగం పెంచాలి..
యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్.. తన బ్యాటింగ్‌లో వేగం పెంచాలని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గిల్ ప్రస్తుతం కోల్‌కతా జట్టుకు ఆడుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. బుల్లితెరపై గుణ 369
యువ కథానాయకుడు కార్తికేయ నటించిన 'గుణ 369'.. బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ఈరోజు(ఆదివారం) సాయంత్రం ప్రసారం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ట్రాన్స్ జెండర్ల కథే..
'లక్ష్మీ బాంబ్' సినిమాకు మూలకథ ఎక్కడి నుంచి వచ్చిందో దర్శకుడు లారెన్స్ తెలిపారు. గతంలో ట్రాన్స్జెండర్ల కథలు విన్న తర్వాత 'కాంచన' చిత్రం చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. దాని హిందీ రీమేక్ 'లక్ష్మీ బాంబ్'. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.