ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1PM
టాప్​టెన్ న్యూస్ @1PM
author img

By

Published : Sep 26, 2020, 1:01 PM IST

1. ఎంతోమందికి నీడ..

జీహెచ్ఎంసీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ గత ఆరేళ్లల్లో దేశంలోని లక్షలాది మందికి గమ్యస్థానంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. పెట్టుబడులు, పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వమే అభివృద్ధికి కారణమని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మన్మోహన్​లా ఉండాలి

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్​ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు రాహుల్. మన్మోహన్​ లాంటి లోతైన ఆలోచన కలిగిన ప్రధాని ప్రస్తుతం లేరని దేశం భావిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మూడు రోజులు రైల్​రోకో..

రాజ్యసభలో ఇటీవల ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పంజాబ్​ వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటికే మూడురోజుల 'రైల్​ రోకో' చేపట్టిన రైతు సంఘాలు.. దాన్ని ఈ నెల 29వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. జిమెక్స్-20

ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతంలో భారత్, జపాన్​ నౌకాదళ విన్యాసాలు జిమెక్స్-20 ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన కీలక యుద్ధ నౌకలు వివిధ ప్రదర్శనలు చేయనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. చైనాకు వార్నింగ్..

సరిహద్దుల్లో దురాక్రమణకు పాల్పడితే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని చైనాకు తేల్చి చెప్పింది భారత్​. వాస్తవాధీన రేఖ వెంబడి తోపులాటలు, కర్రలు, రాళ్లతో ఘర్షణలు ఇకపై ఉండబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ కూడా చైనా వైపు నుంచే ప్రారంభం కావాలని భారత్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఎలా మర్చిపోతాం..

మరో నాలుగేళ్లు తనకు అధికారమిస్తే చైనాతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్​ అక్కడి నుంచే వచ్చిందన్న విషయాన్ని ఎప్పటికీ మరువబోమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఇలా కట్టిపడేయొచ్చు..

కరోనాను ఎంత వేగంగా, కచ్చితత్వంతో గుర్తించగలిగితే అంతే వేగంగా వైరస్ వ్యాప్తిని అరికట్టగలం. వైరస్‌ సోకిందో.. లేదో.. నిర్ధరించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'స్వాబ్‌ టెస్టింగ్‌' విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ పద్ధతిలో గొంతు లేదా ముక్కు లోపలి భాగం నుంచి నమూనాల్ని సేకరించి పరీక్షిస్తారు. ఈ ప్రక్రియలో ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సీఎస్కేకు గ్లూకోజ్ కావాలి..!

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ఈ జట్టు బ్యాట్స్​మెన్ కనబర్చిన బ్యాటింగ్ తీరుపట్ల మాజీలతో పాటు అభిమానులు నిరాశచెందారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అందుకే ఎస్పీబీ గొప్పవారు..

ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ.. ఓ సాధారణ వ్యక్తిగా మెలగడం కొందరికే సాధ్యం. అటువంటి వారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఓ సారి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం వెళ్లిన బాలు.. అక్కడి డోలీవాలల పాదాలకు మొక్కారు. దీంతో సదరు డోలీవాలాలు ఎంతో సంతోషించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. డ్రగ్స్ కేసు అప్​డేట్

నటి శ్రద్ధా కపూర్​ ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి చేరుకుంది. సుశాంత్​ మృతికి సంబంధించిన డ్రగ్​ కేసు విచారణ నిమిత్తం ఎన్​సీబీ ఆమెను ప్రశ్నించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.