ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1pm
టాప్​టెన్​ న్యూస్​ @1pm
author img

By

Published : Sep 21, 2020, 1:06 PM IST

1. 'అద్దె'కు అనుమతివ్వండి

హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్​ భవన్​ ముట్టడికి అద్దె బస్సులు యజమానులు ప్రయత్నించారు. వారిని పోలీసులు ​అడ్డుకున్నారు. 25 శాతం మాత్రమే అద్దె బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అనుమతి ఇచ్చిందని అద్దె బస్సులు యజమానులు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రైతును రాజు చేయడానికే..

దేశంలో ఎక్కడైనా... ఎవరికీ కమీషన్​ ఇవ్వకుండా పంట అమ్ముకునే అవకాశం... కేంద్రం కల్పిస్తోందని ఎంపీ అర్వింద్​ అన్నారు. ఈ ఆర్డినెన్స్​పై తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఫోన్​ ఎత్తలేదని..

ఫోన్​ ఎత్తలేదని మాజీ సహోద్యోగి... మహిళ ఉద్యోగిణిపై దాడి చేసిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. నిందితుడు గతంలో అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. పెళ్లికి నిరాకరించిందని..

పెళ్లికి నిరాకరించిందని యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టరాయునిపల్లిలో చోటుచేసుకుంది. దాడి అనంతరం యువకుడు ట్యాంకు మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అండగా ఉండాలి..

కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో భారత్​, మాల్దీవులు ఒకరికొకరు సాయం చేసుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాలు చిరకాల మిత్రులని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. తాజ్​ను చూడొచ్చు..

కరోనా కారణంగా మూసివేసిన ప్రపంచ ప్రసిద్ధ తాజ్​మాహల్​ సందర్శనను తిరిగి ప్రారంభించారు. అయితే కొవిడ్​ కట్టడి చర్యలతో రోజుకు ఐదు వేల మందినే అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఊగిసలాటలో..

స్టాక్ మార్కెట్లు లాభా నష్టాల మధ్య ఊగిసలాటలో కొనసాగుతున్నయి. అరంభంలో స్వల్ప లాభాలు నమోదు చేసిన సూచీలు.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా కోల్పోయి 38,404 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా తగ్గి.. 11,479 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. పాక్​ బౌలర్ రికార్డు

ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో పాకిస్థాన్ యువ బౌలర్ షాహిన్ అఫ్రిదీ రెచ్చిపోయాడు. హాంప్​షైర్ తరఫున ఆడుతున్న ఇతడు మిడిల్సెక్స్​తో జరిగిన మ్యాచ్​లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'ఎమ్మీ'లో రికార్డు..

72వ ఎమ్మీ అవార్డు ప్రదానోత్సవ వేడుక కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్​గా జరిగింది. నటులు పురస్కారాలను ఇంటివద్ద నుంచే అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటిగా నిలిచిన జెండేయా ఓ రికార్డు ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. నటుడు కార్తికేయ..

కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా టాలీవుడ్ యువ నటుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ గుమ్మకొండ. అజయ్​ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఎక్స్​ 100' చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం సహా విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. నేడు (సెప్టెంబరు 21) కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అతని జీవితంలోని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.