1. బోనాలు షురూ..
ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఓ అసత్యాగ్రాహి
మధ్యప్రదేశ్ రేవాలోని సౌర విద్యుత్ ప్రాజెక్టే.. ఆసియాలో అతిపెద్దదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. కర్ణాటకలో పావగడ పార్కు కన్నా.. రేవా పార్కు ఉత్పత్తి సామర్థ్యం తక్కువని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో మోదీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు రాహుల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. డెంగీ తోడైతే..!
దేశంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇదే సమయంలో వర్షాకాలం నేపథ్యంలో ఇతర అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ఏటా లక్షల కేసులు నమోదయ్యే డెంగీ వ్యాధిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వ్యాధుల లక్షణాలు కూడా ఒకే విధంగా ఉంటాయని.. డెంగీ ప్రబలితే కరోనా సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. యమ డేంజర్
పిల్లలకు చాక్లెట్లంటే ఎంతో ఇష్టం. కానీ పళ్లు పాడవుతాయని తల్లిదండ్రులు వాటిని ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే ఈ చాక్లెట్లను మాత్రం కోరి మరీ ఇస్తారు. ఎందుకంటే వీటిని చిరుధాన్యాలతో తయారుచేశారు. ఇవి రుచితోపాటు పోషకాలనూ అందిస్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జనాభా నియంత్రణ
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా లాంటి మహమ్మారులు కూడా పెచ్చుమీరిపోతున్నాయి. అధిక జనాభా వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. పరిష్కారాలను సూచించేందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఐరాస. 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా.. ఏటా ఈ తేదీన జనాభా దినం జరపాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. తిరుగుబాటుదారుల మృతి
అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు తిరుగుబాటుదారులు మృతి చెందారు. భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య ఖోన్సా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అసోం రైఫిల్స్‌కు చెందిన సైనికుడికి గాయాలయ్యాయి. అతడిని సైనిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. గరిష్ఠానికి రుణాలు, ద్రవ్యలోటు
ప్రపంచవ్యాప్తంగా 2020-21లో ప్రభుత్వ రుణాలు 100 శాతాన్ని దాటి రికార్డు స్థాయికి చేరొచ్చని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. వర్థమాన, అభివృద్ధి చెందిన దేశాలన్నింటిపైనా ఈ అప్పుల భారం ఉండనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. వందేళ్లలో పెద్ద సంక్షోభం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా తాము అనేక చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలోనే ఉందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వికెట్ పడిన ఆనందంలో
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీ విధించిన కరోనా మార్గదర్శకాలను మర్చిపోయాడు. వికెట్ పడిందన్న ఆనందంలో వెళ్లి జట్టు సహచరులను కౌగిలించుకుంటూ కనిపించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సాయిపల్లవి సెంటిమెంట్..
హీరోయిన్ సాయి పల్లవి సినిమాల్లోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ సింపుల్‌గా ఉంటూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే పల్లవి తన చేతికి మాత్రం ఒక ఉడెన్ చైన్‌ను ధరిస్తుంటుంది. మరి అది తన సెంటిమెంటా లేకపోతే ఎవరైనా ఇచ్చిన గిఫ్టా అనేది మాత్రం క్లారిటీ లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.