ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @11AM
టాప్​టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : Dec 26, 2020, 10:59 AM IST

1. రాష్ట్రంలో కరోనా

రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరి మృతితో ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,529కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,84,391 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 536 మంది వైరస్ నుంచి కోలుకోగా... మొత్తం 2,76,244 మంది బాధితులు కరోనా నుంచి విముక్తి పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఘోర ప్రమాదం

కూలీ పనుల కోసం వెళ్లినవాళ్లపై విధి పగబట్టింది. కూలీ పనుల కోసం బయలుదేరిన వారిని బస్సు, లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ పేద బతుకులను కబళించింది. పని చేయాల్సిన శరీరాలు ప్రమాదంలో నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవులుగా మారిన ఆ కూలీలను చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. భాజపా నేత హత్య

ఖమ్మం జిల్లా వైరాలో భాజాపా రాష్ట్ర నాయకుడు నేలవెళ్లి రామారావుపై పట్టణానికి చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం ఆరు గంటల సమయంలో పాత బస్టాండ్ ప్రాంతంలోని రామారావు ఇంటికి వెళ్లి యువకుడు కత్తితో దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'కాల్పుల' ఘటనలో వ్యక్తి మృతి

ఈ నెల 18న ఆదిలాబాద్​లో జరిగిన కాల్పుల్లో గాయపడిన సయ్యద్ జమీర్​(52) మృతి చెందాడు. ఆదిలాబాద్​ తాటిగూడలో ఎంఐఎం నేత ఫారూఖ్​ అహ్మద్... జమీర్​​ తుపాకీతో కాల్పులు జరపగా, మరి వ్యక్తిపై కత్తితో వీరంగం చేశాడు. తీవ్రంగా గాయపడిన జమీర్​... హైదరాబాద్​ నిమ్స్​లో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. దేశంలో కరోనా..

దేశంలో కొత్తగా 22,272 మంది కరోనా బారినపడ్డారు. మరో 251 మంది కొవిడ్​ కారణంగా మరణించారు. దేశవ్యాప్త రికవరీ రేటు 95.78 శాతానికి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 8 కోట్లు దాటింది..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం కొత్తగా 4.72 లక్షల కేసులు, 8వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 8 కోట్ల మార్క్​ను దాటింది. మరణాలు 17.5 లక్షలకు చేరుకున్నాయి. అమెరికాలోనే అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతుండగా.. ఆ తర్వాత బ్రిటన్​, రష్యాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మురికివాడలో సున్నా..!

దేశంలో కొవిడ్​ వ్యాప్తి తగ్గుతోంది. ముంబయిలోని ధారావిలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు. ప్రస్తుతం ధారావిలో 12 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. గిరాకే ఇంధనం..

దేశ ఆర్థిక వృద్ధిలో కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్నది వినియోగ డిమాండు. ఇది కొంతకాలంగా కుదించుకు పోయింది. ఈ సంకట స్థితిలో ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపి ఆర్థిక వృద్ధిని ఉరకలెత్తించడానికి సరఫరా కారకాల కంటే గిరాకీని ప్రేరేపించే కారకాలే శరణ్యం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం మూడో ఉద్దీపన చర్యల్లో ఆర్థిక వృద్ధిని ప్రేరేపించే విధానాలకు ప్రాధాన్యమిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. స్మిత్.. తొలిసారి

'బాక్సింగ్​ డే' తొలి ఇన్నింగ్స్​లో డకౌట్​ అయిన స్మిత్.. అభిమానుల్ని నిరాశపరిచాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పరుగులేమి చేయకుండానే పెవిలియన్​ దారిపట్టడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అదరగొట్టేశారు..!

ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కొత్త దర్శకులు తమ జోరు చూపించారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను బాగా అలరించారు. వారెవరు? ఏ చిత్రాలతో ముందుకొచ్చారు? లాంటి విషయాల సమాహారమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.