1. రాష్ట్రంలో కరోనా..
తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,79,135 మంది కొవిడ్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఇండోనేషియా పెట్టుబడులు
మంత్రి కేటీఆర్‌తో ఇండోనేషియా రాయబారి సమావేశం జరిగింది. తెలంగాణలో పెట్టుబడులకు ఇండోనేషియా ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి సూర్యొదిపురొ తెలిపారు. త్వరలోనే పారిశ్రామికవేత్తలు పర్యటిస్తారని వెల్లడించారు. ప్రభుత్వపరంగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దారుణం..
రైతులకు మద్దతుగా అమెరికాలో చేపట్టిన ఆందోళనల్లో 'మహాత్మా గాంధీ' విగ్రహం అపవిత్రం చేయడాన్ని అత్యంత దారుణ ఘటనగా.. శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ అభివర్ణించారు. హక్కులు, విలువల కోసం పోరాడిన మహాత్ముడి లాంటి వారి ప్రతిష్ఠను గౌరవించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 30 వేల దిగువకు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 26,382 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మరో 387 మందిని కొవిడ్ బలితీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఏపీలో 25 నుంచి వ్యాక్సిన్..
ఏపీలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సీఎం జగన్ ఆదేశం మేరకు కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కౌంట్‌డౌన్..
పీఎస్ఎల్వీసీ 50 రాకెట్ ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. కిల్లర్ అల్లుడు..
ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో వృద్ధ దంపతుల హత్యకు గురయ్యారు. ఆస్తి కోసమే కుమార్తె, అల్లుడు హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. స్థిర లాభాలతో..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా లాభంతో 46,488 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకుపైగా వృద్ధితో 13,629 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అలా చేయం..
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీతో అనవసరంగా స్లెడ్జింగ్ చేయమని ఆస్ట్రేలియా కోచ్ చెప్పాడు. భారీ స్కోరు చేయకుండా అతడ్ని అడ్డుకోవడానికి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతాం అని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. నవ్వుకుంటూ వస్తారు..
సోలో బతుకు గురించి శ్లోకాలు వల్లెవేస్తున్నారు సాయితేజ్. సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ తనకు సోలో లైఫే మేలు అంటున్నాడాయన. ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా ఆయన నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా.. థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రం విషయంలో సాయి తేజ్ ఎంత నమ్మకంగా ఉన్నారు? తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన మనసులో మాటేమిటి? నిహారిక పెళ్లి సందడి ముచ్చట్లు తదితర విషయాలపై 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.