1. రిజిస్ట్రేషన్లు ప్రారంభం
మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేత ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ ఉదయం పదిన్నరకు ప్రారంభమైంది. ముందుస్తుగా స్లాట్ బుక్ చేసుకున్నవారికి సమయం కేటాయించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అమావాస్య కావడం వల్ల ఈ రోజు బుకింగ్‌లు తక్కువగా అయినట్టు అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అంగన్వాడీల్లోనే ఆధార్..
ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఇందుకు చిన్నపిల్లలకు సైతం మినహయింపు లేదు. ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని తమ పిల్లల వివరాల నమోదుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం కరోనా మహమ్మారి సైతం పొంచి ఉంది. ఈ నేఫథ్యంలో చిన్నారుల చెంతకే వెళ్లి ఆధార్ నమోదు చేసేలా ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దత్తాత్రేయతో భేటీ..
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రైతుల దీక్ష
రాజస్థాన్ హరియాణా సరిహద్దు జైసింఘ్పుర్-ఖేరా ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు రైతులు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రెండో రోజూ నిరసనకు దిగారు. అధికారులు ముందు జాగ్రత్తగా అక్కడ బలగాలను మోహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మరో 27,071 కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 27,071 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మరో 336 మందిని కొవిడ్ బలితీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6 . దర్శనం నిలిపివేత
కేరళ త్రిస్సూర్‌లోని ప్రముఖ గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనాలను రెండు వారాలపాటు నిలిపివేసినట్లు దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇటీవల ఆలయ సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే..వర్చువల్ క్యూ విధానం ద్వారా పరిమిత సంఖ్యలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఊపిరితిత్తుల హైజాక్
కరోనా వైరస్‌కు సంబంధించి కీలక ప్రక్రియను వెలుగులోకి తెచ్చారు అమెరికా శాస్త్రవేత్తలు. మహమ్మారి సోకిన తర్వాత మానవ ఊపిరితిత్తుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లోని ప్రొటీన్లు, ఫాస్ఫోరిలేషన్ కణాలపై అధిక ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. లాభాల్లో మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఇప్పటికే ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 80 పాయింట్లకుపైగా లాభంతో 46,179 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 30 పాయింట్లు పెరిగి 13,541 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కష్టంగా ఉంది..!
భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం చెమటోడుస్తున్నట్లు చెప్పాడు ఆస్ట్రేలియా క్రికెట్ర్ స్మిత్. కాసేపు కూడా క్రికెట్‌ను వదిలి ఉండటం తనకు చాలా కష్టంగా ఉందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. చెర్రీ 'అతిథి' కాదు..
'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్‌ను పూర్తిస్థాయిలో చాలా శక్తివంతంగా చూపించబోతున్నట్లు చెప్పారు ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ సినిమా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.